TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 633 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి
TG Pharmacist Recruitment 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీన రాత పరీక్షలు ఉంటాయి.
ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి ఇటీవలే 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. అర్హత కలిగిన అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబర్ 21వ తేదీతో పూర్తి అవుతుంది.
అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్ కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఇలా దరఖాస్తు చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Click here to apply for the post of Pharmacist Grade-II లింక్ పై క్లిక్ చేయాలి.
- ప్రాథమిక వివరాలు, మెయిల్ అడ్రస్ తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- దరఖాస్తు రుసుం రూ. 200 చెల్లించాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ అడిగిన వివరాలతో పాటు ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- ఆన్ లైన్ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు :
- ఉద్యోగ ప్రకటన - తెలంగాణ వైద్యారోగ్యశాఖ
- ఉద్యోగ ఖాళీలు - ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2
- మొత్తం ఖాళీలు - 633
- దరఖాస్తులకు తుది గడువు - 21, అక్టోబర్ , 2024.
- దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - అక్టోబర్ 23, 24
- రాత పరీక్షలు - 11 నవంబర్ , 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/