Chilamathur Gang Rape Case : చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!-sathya sai chilamathur gang rape case police arrested six members including three minors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chilamathur Gang Rape Case : చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!

Chilamathur Gang Rape Case : చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!

Bandaru Satyaprasad HT Telugu
Oct 13, 2024 05:01 PM IST

Chilamathur Gang Rape Case : శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.

చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!
చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో హిందూపురానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు.

చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో అత్తాకోడలిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులకు హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. ఈ దారుణంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని, సీఎం వారి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకోగలిగారన్నారని మంత్రి సవిత తెలిపారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు టీమ్ గాలించి అదుపులోకి తీసుకున్నాయన్నారు. మరికొన్ని గంటల్లో నిందితులను బయటపెడతామన్నారు. ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉందని, వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దసరా పండుగ పూట దారుణ జరిగింది. గుర్తుతెలియని దుండగులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్‌ మిల్లులో కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం యజమాని వాచ్‌మన్‌ పనిచేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు ఇతర పనులు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు, కొడవలితో బెదిరించి అత్తాకోడలిపై ఘాతుకానికి పాల్పడ్డారు. తండ్రీకొడుకులను బెదించి ఇద్దరు మహిళలపై దారుణానికి పాల్పడ్డారు.

కర్ణాటకలో బళ్లారికి చెందిన ఓ కుటుంబం చిలమత్తూరు పేపర్ మిల్లులో పనిచేసేందుకు ఐదు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లు వద్దే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున... కొందరు దుండగులు బైక్ లపై వచ్చి తండ్రీకొడుకులను కొడవలితో బెదిరించి, అత్తాకోడలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం