AP KGBV Notification : ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు-జిల్లాల వారీగా ఖాళీలు
AP KGBV Notification : ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తులకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 15 వరకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు-జిల్లాల వారీగా ఖాళీలు
ఏపీలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరంలో బోధనేతర సిబ్బంది పోస్టులను ఏడాది కాలానికి భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అక్టోబరు 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ నెల 17న ఆ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తారు. ఎంపిక మహిళా అభ్యర్థులుగౌరవ వేతనంగా నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
టైప్-III కేజీబీవీ ఖాళీలు - 547
- హెడ్ కుక్ - 48 పోస్టులు
- అసిస్టెంట్ కుక్ - 263 పోస్టులు
- డే/ నైట్ వాచ్ ఉమెన్ - 95 పోస్టులు
- స్కావెంజర్ - 78 పోస్టులు
- స్వీపర్ - 63 పోస్టులు
టైప్-IV కేజీబీవీ - 182 పోస్టులు
- హెడ్ కుక్ - 48 పోస్టులు
- అసిస్టెంట్ కుక్ - 76 పోస్టులు
- చౌకీదార్ - 58 పోస్టులు
జిల్లాల వారీగా పోస్టులు
- శ్రీకాకుళం - 36
- పార్వతీపురం మన్యం - 25
- విజయనగరం -55
- విశాఖపట్నం -7
- అల్లూరి - 28
- అనకాపల్లి -21
- ఏలూరు -6
- కాకినాడ -13
- ఎన్టీఆర్ -4
- పల్నాడు -96
- బాపట్ల -4
- ప్రకాశం -52
- నెల్లూరు -14
- చిత్తూరు -15
- తిరుపతి -3
- కడప -43
- అన్నమయ్య - 78
- సత్యసాయి-44
- అనంతపురం -71
- నంద్యాల - 63
- కర్నూలు - 51
- మొత్తం ఖాళీలు - 729
ముఖ్యమైన తేదీలు
- ఎంఈవో ఆఫీసులో దరఖాస్తులు సమర్పణ - అక్టోబర్ 7 నుంచి 15 వరకు
- మండలాల వారీగా దరఖాస్తుదారుల లిస్ట్ తయారీ - అక్టోబర్ 16
- జిల్లా స్థాయి విద్యాశాఖ కార్యాలయానికి అప్లికేషన్లు సబ్మిట్ - అక్టోబర్ 17
- జిల్లా స్థాయిలో దరఖాస్తుదారుల లిస్ట్ తయారీ - అక్టోబర్ 18
- జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ముందుకు దరఖాస్తులు - అక్టోబర్ 21
- ఏపీసీవోసీ ఛైర్మన్ కు సెలక్షన్ లిస్ట్ సబ్మిట్ - అక్టోబర్ 22
- రిపోర్టింగ్ డ్యూటీ - అక్టోబర్ 22
వయస్సు, అర్హతలు
- అభ్యర్థుల వయసస్సు 01-07-2024 నాటికి 42 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితి 47 కాగా, దివ్వాంగులకు 52 ఏళ్లు, ఎక్స్ సర్వీల్ ఉమెన్ కు 45 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించారు.
- హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులకు విద్యార్హతలు తప్పనిసరి కాదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
- వయో పరిమితికి వయస్సును రికార్డు షీట్, టీసీ, ఆధార్ కార్డ్ ప్రకారం నిర్ణయిస్తారు.
- డే/ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు 7వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
సంబంధిత కథనం