తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు..!

AP Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు..!

HT Telugu Desk HT Telugu

16 November 2022, 7:21 IST

    • low pressure in bay of bengal: ఇప్పటికే ఏపీలోని ప‌లు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో అల్పపీడనం ముప్పు రానుంది. ఫలితంగా పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

Rain Alert to Andhrapradesh: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటున సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద ఇవాళ(నవంబర్ 16 అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా నవంబర్ 18వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

కొద్దిరోజులుగా చూస్తే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విపరీతంగా వానలు పడుతున్నాయి. శనివారం ముందు వరకు మూడు రోజుల పాటు సాధారణ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నుంచి వర్షం పెరిగింది. నెల్లూరు జిల్లాలోని కావలి(Kavali), కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో వర్షం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడుతుండటంతో... ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తెలంగాణలో చూస్తే వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిది. ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది, ఈశాన్యం దిశల నుంచి గాలు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది.