Nellore Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. భయపెడుతున్న మరో అల్పపీడనం-heavy rains in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Heavy Rains In Nellore District

Nellore Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. భయపెడుతున్న మరో అల్పపీడనం

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 04:18 PM IST

Andhra Pradesh Rains : ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరోవైపు అల్పపీడనం భయపెడుతోంది.

నెల్లూరు వర్షాలు
నెల్లూరు వర్షాలు

నెల్లూరు జిల్లా(Nellore District)లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే మరోవైపు అల్పపీడనం భయపెడుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విపరీతంగా వానలు పడుతున్నాయి. శనివారం ముందు వరకు మూడు రోజుల పాటు సాధారణ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నుంచి వర్షం పెరిగింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

నెల్లూరు జిల్లాలోని కావలి(Kavali), కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో వర్షం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం(Bay Of Bengal)లో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Atmakuru) బస్టాండ్, రామలింగాపురం, మాగుంట తదితర ప్రాంతాల్లో జోరువాన పడింది. పలు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతోంది. రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 ఫోన్ నంబర్లకు సహాయక చర్యల కోసం కాల్ చేయోచ్చు.

భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంబించాయి. కావలి, నెల్లూరు, కోవూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి ప్రవాహంలో ప్రైవేట్ బస్ నిలిపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు భారీగా చేరింది.

నెల్లూరు కార్పొరేషన్(Nellore Corporation) కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 18004251113, 0861 230 1541కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ కోరారు. బోగోలు మండలం జక్కపల్లి గూడూరు చెరువు కలుజు నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో మిరప, పొగాకు, మినుము పంటలకు నష్టంవాటిల్లింది.

WhatsApp channel