తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Key Instructions For Ap Police Constable 2023 Is Scheduled To Be Conducted On 22 January 2023

AP Police Constable Exam: రేపే కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష.. ఈ నిబంధనలు తప్పనిసరి

HT Telugu Desk HT Telugu

21 January 2023, 11:24 IST

    • key Instructions for AP Police Constable Exam 2023:ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(జనవరి 22) జరిగే పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది.
ఏపీ కానిస్టేబుల్ పరీక్ష
ఏపీ కానిస్టేబుల్ పరీక్ష (slprb.ap.gov.in)

ఏపీ కానిస్టేబుల్ పరీక్ష

AP Police Constable Exam 2023 Updates: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రిక్రూట్ మెంట్ బోర్డు... తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. జనవరి 22న నిర్వహించే పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో పాటు పలు ముఖ్య సూచనలను చేసింది. వాటిని చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

-అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు.

-ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.

-మొబైల్‌ ఫోన్‌/సెల్యూలార్‌ ఫోన్, ట్యాబ్‌/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు/రికార్డింగ్‌ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.

-ఆయా వస్తువులను భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.

-అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి.

-హాల్‌టికెట్ తప్పనిసరి. బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి.

-అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. తేడా వస్తే చివర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

మొత్తం 6100 ఉద్యోగాలు...

580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు. కానిస్బేబుల్‌ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో పరీక్షను రాసేందుకు అనుమతిస్తారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 3,64,184 మంది అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 1,39,075 మంది ఇంగ్లీష్‌లో పరీక్ష రాయనున్నారు. 227మంది అభ్యర్థులు ఉర్దూలో పరీక్షను రాసేందుకు ఎంచుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,03,486మంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రాథమిక స్థాయిలో 82.5 మంది పోటీ పడుతున్నారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో 3,95,415మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా దరఖాస్తు చేసిన వారిలో ఓసీ అభ్యర్థులు 53,778, బీసీ అభ్యర్థులు 2,74,567మంది , ఎస్సీ అభ్యర్థులు 1,31,875మంది, ఎస్టీలు 43,266మంది ఉన్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 13,961మంది, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 1,55,537, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు 2,97,655మంది, ఇతరులు 36,333మంది ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి 50,268, విజయనగరం నుంచి 40,321, విశాఖపట్నం నుంచి 50002, తూర్పు గోదావరి నుంచి 42,501, పశ్చిమ గోదావరి నుంచి 27,504, కృష్ణా జిల్లా నుంచి 34,791, గుంటూరు నుంచి 37,526, ప్రకాశం జిల్లా నుంచి 33,484, నెల్లూరు జిల్లా నుంచి 25,132, కర్నూలుజిల్లా నుంచి 51,972, కడప జిల్లా నుంచి 27,217, అనంతపురం నుంచి 41,133, చిత్తూరు జిల్లా నుంచి 33,934, ఇతర రాష్ట్రాల నుంచి 7701 దరఖాస్తులు అందాయి