APPSC : ఏపీపీఎస్సీ హాల్‌ టిక్కెట్లు….-appsc group 1 applications last date extension ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Appsc Group 1 Applications Last Date Extension

APPSC : ఏపీపీఎస్సీ హాల్‌ టిక్కెట్లు….

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 07:45 AM IST

APPSC ఆంధ్రప్రదేశ‌‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ఆధ్వర్యంలో జరుగ నున్న ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌ ఉద్యోగ నియామకాల హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం
విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం

APPSC ఏపీపీఎస్సీ ఆధ‌్వర్యంలో చేపట్టిన అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఇన్ ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. 2022 జనరల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీలో అసిస్టెంట్ కన్జర్వేటర్‌ ఇన్ ఫారెస్ట్ ఉద్యోగాలను భర్తీచ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. నవంబర్ 9, 10 తేదీలలో ఉదయం,మధ్యాహ్నం, 11వ తేదీన ఉదయం కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏపీపబ్లిక్ సర్వీస్ కమిషన్‌ వెబ్‌సైట్ https://psc.ap.gov.in నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గ్రూప్‌ వన్ దరఖాస్తులకు ముగియనున్న గడువు

గ్రూప్‌ వన్‌ దరఖాస్తుల సమర్పణకు గడువు నేటితో ముగియనుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్‌ 1 దరఖాస్తుల్ని సమర్పించేందుకు నవంబర్‌ 5వ తేదీ వరకు గడువు పొడిగించారు. నవంబర్ 4వ తేదీతో ఫీజుల చెల్లింపు గడువు ముగుస్తుంది. గత సెప్టెంబర్‌లో జారీ చేసిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువు నవంబర్‌ 2వ తేదీతో ముగిసింది. దరఖాస్తులు సమర్పించే విషయంలో అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందడంతో ఏపీపీఎస్సీ గడువు పొడిగించింది. శుక్రవారం రాత్రి 11.59లోపు అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. శనివారంలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

2022 సెప్టెంబర్ 30న జారీ చేసిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాల స్క్రీనింగ్‌ పరీక్షను డిసెంబర్ 18న నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షను 2023 మార్చి ద్వితియార్థంలో నిర్వహిస్తారు. గ్రూప్‌ వన్ దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

IPL_Entry_Point