తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Araku Tour: ఆంధ్రా ఊటీ 'అరకు' ట్రిప్ వెళ్తారా..? మీ కోసమే ఈ సరికొత్త ప్యాకేజీ

IRCTC Araku Tour: ఆంధ్రా ఊటీ 'అరకు' ట్రిప్ వెళ్తారా..? మీ కోసమే ఈ సరికొత్త ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

17 March 2023, 19:38 IST

    • Visakhapatnam Araku IRCTC Tour:  అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన డేట్స్ తో పాటు ధరలను కూడా ప్రకటించింది.
అరకు టూర్
అరకు టూర్ (www.irctctourism.com)

అరకు టూర్

IRCTC Tourism Visakhapatnam Araku Tour: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ... కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Visakhapatnam Araku tour details: ప్రస్తుతం ఈ టూర్ మార్చి 22వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.

Day 01 : ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.

అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు....

Visakhapatnam Araku Tour Cost: ఈ ఒక్క రోజు ప్యాకేజీకి చూస్తే... ఈసీ క్లాస్ లో పెద్దలకు 3060గా ఉంటే.. పిల్లలకు 2670గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో పెద్దలకు రూ. 2385గా ఉంది. ఇక ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. వెళ్లే కోచ్ ను బట్టి ఇచ్చిన ధరలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

అరకు టూర్ ప్యాకేజీ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.