తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Alert : ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్

AP Weather Alert : ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్

HT Telugu Desk HT Telugu

15 April 2023, 10:45 IST

    • Telugu States Temperatures Updates: ఏపీపై భానుడి పంజా విసురుతున్నాడు. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐఎండీ అంచనాల ఆధారంగా ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ.
ఏపీలో భానుడి భగభగలు
ఏపీలో భానుడి భగభగలు

ఏపీలో భానుడి భగభగలు

Today Andhrapradesh Temperatures : రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 115 మండలాల్లో వడగాల్పులు, రేపు 65 మండలాల్లో వడగాల్పుపు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(12):-

అనకాపల్లి:- కె. కోటపాడు, మాకవరపాలెం,నర్సీపట్న, నాతవరం

కాకినాడ :- కోటనందూరు

మన్యం:- గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మవలస,కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(115) :-

అల్లూరి జిల్లాలో - 7 మండలాలు

అనకాపల్లి - 13,

తూర్పుగోదావరి - 10,

ఏలూరు - 01

గుంటూరు- 06,

కాకినాడ - 16,

కోనసీమ - 6,

కృష్ణా - 2,

ఎన్టీఆర్ - 4,

పల్నాడు - 3,

మన్యం -7,

శ్రీకాకుళం -13,

విశాఖపట్నం - 03,

విజయనగరం జిల్లాలోని 24 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తగినంత స్థాయిలో నీరు తాగాలని.. ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. బయటకు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ అధికారులు కూడా చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసం,కొబ్బరినీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణకు వర్ష సూచన…

ఇక తెలంగాణలో చూస్తే…. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు పడుతాయని తెలిపింది. అయితే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ వీస్తాయని వెల్లడించింది. పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడకక్కడ కురుస్తాయని స్పష్టం చేసింది.