తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Earthquake In Andhrapradesh : ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు - భయాందోళనలో స్థానికులు..!

Earthquake in Andhrapradesh : ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు - భయాందోళనలో స్థానికులు..!

22 December 2024, 11:57 IST

google News
    • Earthquake in Prakasam district : ప్రకాశం జిల్లాలో మరోసారి ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కంపించింది. వరసగా రెండోరోజు కూడా భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రకాశం జిల్లా మరోసారి స్వల్ప భూప్రకంపనలు
ప్రకాశం జిల్లా మరోసారి స్వల్ప భూప్రకంపనలు

ప్రకాశం జిల్లా మరోసారి స్వల్ప భూప్రకంపనలు

మరోసారి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెం, మారెళ్లలో భూమి స్వల్పంగా కంపించటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వరసగా రెండోరోజు కూడా భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

నిన్న కూడా భూప్రకంపనలు…!

నిన్ననే ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. 2సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురం, ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలు రావడంతో.. స్థానికులు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.

డిసెంబర్ మాసం మొదటి వారంలో తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం 7:30 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించింది. దీని ప్రభావంతో... ములుగు, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.

భూ ప్రకంపనలు ఎందుకు వస్తాయి…?

భూమి లోపల పోరలతో నిర్మితమై ఉంటుంది. ఈ పోరలు లేదా పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. భూప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే…. దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ పై రికార్డు చేస్తారు. రిక్టర్ స్కేల్ పై 05 నుంచి 5.9 వరకు రికార్డ్ అయితే… ఫర్నిచర్ అంతా కిందపడి పోయే విధంగా భూమి కంపిస్తుంది. 7 నుంచి 7.9గా ఉంటే భవనాలు కూలిపోతాయి. అల్లకల్లోల వాతావరణం సంభవిస్తుంది. భూమి లోపల పొరల్లో జరిగే కొన్ని సర్దుబాటు కారణాలతో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేతలు చెబుతున్నారు.

భూకంపాల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రాంతం సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ… నది పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉండే ఏరియాల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండదని శాస్త్రవేతలు చెబుతున్నారు. భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయ‌ని…. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మో గ్రాఫ్’ అంటారు. ఇక భారత్ లో చూస్తే నాలుగు సిస్మోక్ జోన్లు(జోన్ II, జోన్III, జోన్IV, జోన్V.) ఉంటాయి. ఇందులో తెలంగాణలో జోన్ 2లో ఉంది. ఈ జోన్ లో ఉండే ప్రాంతాలకు అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంటుంది. ఇక జోన్ 3 పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

తదుపరి వ్యాసం