తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gvl Vs Purandeswari: ఆ ఇద్దరూ అంటూ కామెంట్స్...జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్

GVL Vs Purandeswari: ఆ ఇద్దరూ అంటూ కామెంట్స్...జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్

HT Telugu Desk HT Telugu

18 February 2023, 7:31 IST

    • BJP Andhrapradesh News: ఏపీ బీజేపీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కన్నా రాజీనామా చేయటం, పార్టీ అధ్యక్షుడు సోముపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంపై రచ్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే మరో ఇద్దరు నేతల మధ్య వార్ మొదలైంది.
జీవీఎల్ కామెంట్స్.. పురందేశ్వరి కౌంటర్
జీవీఎల్ కామెంట్స్.. పురందేశ్వరి కౌంటర్

జీవీఎల్ కామెంట్స్.. పురందేశ్వరి కౌంటర్

Purandeswari Counter to MP GVL Comments: బీజేపీ ఆంధ్రప్రదేశ్.... ఈ మధ్యనే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. అంతేకాదు... ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీరువల్లే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మార్పునకు కూడా సోమునే కారణమంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై ఓవైపు పార్టీలో రచ్చ జరుగుతుండగానే.... ఏపీ బీజేపీలో మరో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇందుకు కారణమయ్యాయి. ఇదీ కాస్త పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.

జీవీఎల్ కామెంట్స్....

కన్నా రాజీనామాతో పాటు పలు అంశాలపై గురువారం మీడియాతో మాట్లాడారు ఎంపీ జీవీఎల్. ఇదే సమయంలో వైఎస్ఆర్, ఎన్టీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. అన్ని పథకాలకూ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ పేర్లే పెడుతున్నారని అంటూ టీడీపీ, వైసీపీలను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని పథకాలకు ఆ ఇద్దరి పేర్లానా? ఇంకా ఎవరూ లేరా? అని నిలదీశారు. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం.. రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు సంబంధించినది కాదన్న ఆయన.. అన్నింటికీ వైఎస్‌ఆర్ పేరేనా? వైఎస్‌ఆర్‌ అంటే అందరికీ అభిమానమే.. కానీ, అన్ని పథకాలకు ఆ పేర్లేనా..? మిగతా నేతలు ఎవరూ కనిపించరా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేయగా... వారిద్దరి పేర్లు పెట్టారని.. వంగవీటి మోహన రంగారావు పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో నేతలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రంగా కూడా కేవలం ఒక్క వర్గం కోసం కాదని... అన్ని వర్గాల కోసం పోరాటం చేశారని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ , వైఎస్ఆర్ లను ఉద్దేశిస్తూ జీవీఎల్ చేసిన కామెంట్స్ పై పురందశ్వరి స్పందించారు. జీవీఎల్ మాట్లాడిన వీడియోని జోడించి... ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరోకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

జీవీఎల్ కామెంట్స్ చేయటం, వెంటనే పురందేశ్వరి స్పందించటంతో ఏపీ బీజేపీలో మరో వివాదం రాజుకున్నట్లు అయింది. ఇప్పటికే కన్నా అంశంపై చర్చ జరుగుతుండగా.. ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.