తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Police Has Registered A Case Against Janasena Chief Pawan Kalyan

Case against Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా…?

HT Telugu Desk HT Telugu

12 November 2022, 16:02 IST

    • Police Case On Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. కారుపై కూర్చొని వెళ్లడంపై అందిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు.
జనసేన అధినేత పవన్ (ఫైల్ ఫొటో)
జనసేన అధినేత పవన్ (ఫైల్ ఫొటో) (twitter)

జనసేన అధినేత పవన్ (ఫైల్ ఫొటో)

Police Case against Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍పై కేసు నమోదైంది. తాడేపల్లి పీఎస్‍లో అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చొని వెళ్లడంతో పాటు రాష్ డ్రైవింగ్, హైవేపై పవన్ కాన్వాయ్‍ని పలు వాహనాలు అనుసరించడంపై కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

తెనాలి మారిస్‍పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ తో పాటు కారు డ్రైవర్‍ను కూడా ఇందులో చేర్చారు. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉండగా.. మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే…

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకు నవంబర్ 5వ తేదీన పవన్ కల్యాణ్ ఆ గ్రామానికి వెళ్లారు. మొదట ఆయన వాహనాలతో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే పవన్ నడుచుకూంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం పోయిన తర్వాత పోలీసులు వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో పవన్.. కారుపైకి ఎక్కి కూర్చుని వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వెళ్లటాన్ని పలు పక్షాలు తీవ్రంగా ఖండించాయి.

అయితే ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం.. పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసు నమోదుపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి.