తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 30, 2024: Konda Surekha : సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 30 Sep 202404:58 PM IST
Telangana News Live: Konda Surekha : సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
- Minister Konda Surekha : బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్స్ చేశారని మంత్రి సురేఖ కంటతడి పెట్టారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంతో ముడిపెట్టి, బంధాన్ని అంటగట్టి బీఆర్ఎస్ హేయమైన చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు.
Mon, 30 Sep 202403:01 PM IST
Telangana News Live: TG DSC : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
- TG DSC : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.
Mon, 30 Sep 202402:24 PM IST
Telangana News Live: Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్- 5 లక్షల మంది వివరాలు సేకరణ, త్వరలో నిధులు జమ
- Rythu Runa Mafi : మూడు విడతల్లో రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని 5 లక్షల మంది రైతుల వివరాలు సేకరించింది. త్వరలో వీరి ఖాతాల్లో రూ.5 వేల కోట్లు జమకానున్నాయి.
Mon, 30 Sep 202412:49 PM IST
Telangana News Live: Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. పార్కింగ్ ఫీజు వసూలుకు ముహూర్తం ఫిక్స్!
- Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో.. పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. ప్రయాణికుల వాహనాలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది.
Mon, 30 Sep 202412:10 PM IST
Telangana News Live: TG Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
- TG Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కుటుంబ ఫొటో దిగడం ఆప్షన్ మాత్రమేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు.
Mon, 30 Sep 202411:43 AM IST
Telangana News Live: HYDRA : మూసీ వద్ద హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదు, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
- HYDRA : మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Mon, 30 Sep 202411:26 AM IST
Telangana News Live: Sangareddy Crime : ఆస్తి కోసం ఓ కూతురి నిర్వాకం, తండ్రి బతికుండగానే చనిపోయాడని భూమి పట్టా చేయించుకున్నవైనం
- Sangareddy Crime : ఆస్తి కోసం తండ్రి బతికుండగానే చనిపోయాడని చెప్పి, రెవెన్యూ అధికారుల సాయంతో కొంత భూమిని తన పేరిట రాయించుకుందో కూతురు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంపై మనవడు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.
Mon, 30 Sep 202410:59 AM IST
Telangana News Live: Hyderabad : మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం.. ముందు హైడ్రా ఆఫీసును కూల్చండి: కేటీఆర్
- Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు మూసీ ప్రక్షళన పేరుతో పెద్ద స్కామ్‌కు ప్లాన్ చేసిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. అక్రమ కట్టడాల గురించి మాట్లాడితే.. ముందు హైడ్రా ఆఫీసును కూల్చేయాలన్నారు.
Mon, 30 Sep 202410:08 AM IST
Telangana News Live: Dasara Special Trains : దసరా, దీపావళి పండుగ రద్దీ- దక్షిణ మధ్య రైల్వే 650 ప్రత్యేక రైళ్లు, తిరుపతికి స్పెషల్ సర్వీసులు
- Dasara Special Trains : దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 650 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక సర్వీసులు అక్టోబర్, నవంబర్ నెలలో నడుపుతున్నట్లు పేర్కొంది.
Mon, 30 Sep 202408:12 AM IST
Telangana News Live: High Court on Hydra : చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా?: హైకోర్టు
- High Court on Hydra : హైకోర్టులో హైడ్రాపై విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. అమీన్‌పూర్ తహశీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి.. 40 గంటల్లోపే ఎలా కూల్చుతారని ధర్మాసనం సీరియస్ అయ్యింది.
Mon, 30 Sep 202407:25 AM IST
Telangana News Live: TG School Holidays : ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. మళ్లీ అక్టోబర్ 15న పునః ప్రారంభం
- TG School Holidays : తెలంగాణలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎల్లుండి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పాఠాశాలలకు సెలవు ప్రకటించారు. ఆక్టోబర్ 15న స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో.. విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
Mon, 30 Sep 202407:06 AM IST
Telangana News Live: Bandi Sanjay: ఢిల్లీకి కప్పం కట్టేందుకే హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్ళు చేస్తున్నారన్న బండి సంజయ్
- Bandi Sanjay: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బిఆర్ఎస్ లక్ష కోట్లను దోచుకుంటే, మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరదీసిందని ఆరోపించారు.
Mon, 30 Sep 202406:34 AM IST
Telangana News Live: TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. డైరెక్ట్ లింక్ ఇదే..
- TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో విడుదల చేశారు. ఈ జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. 11వేల పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ పరీక్షల్ని నిర్వహించారు.
Mon, 30 Sep 202406:30 AM IST
Telangana News Live: Nirmal School Teachers: సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, గాడి తప్పుతున్న పాఠశాల విద్యా వ్యవస్థ
- Nirmal School Teachers: నిర్మల్ జిల్లా లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదృశ్యమయ్యారు. బిట్ కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు స్వచ్ఛంధంగా సెలవులు పెట్టుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. బిట్కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Mon, 30 Sep 202404:58 AM IST
Telangana News Live: BJP MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! రెక్కీ నిర్వహించిన ఇద్దరు అరెస్టు
- BJP MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం సృష్టించింది. వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరి ఫోన్లు చెక్ చేయగా.. రాజాసింగ్ ఫొటోలు, గన్, బుల్లెట్ల ఫొటోలు కనిపించినట్టు తెలిసింది.
Mon, 30 Sep 202404:39 AM IST
Telangana News Live: TGRTC E garuda: ఇక ఔటర్‌పై BHEL ఈ గరుడ పరుగులు, విజయవాడకు గంటన్నరకు పైగా తగ్గనున్న ప్రయాణ సమయం
- TGRTC E garuda: BHEL- విజయవాడ మధ్య ప్రయాణ సమయం గంటన్నరకు పైగా తగ్గిపోనుంది. ఇకపై బీహెచ్‌ఇఎల్ నుంచి విజయవాడకు బయల్దేరే బస్సులు హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం లేకుండా నేరుగా ఔటర్ మీదుగా పరుగులు తీస్తారు. ఫలితంగా దాదాపు గంటన్నర సమయం ఆదా కానుంది.
Mon, 30 Sep 202402:18 AM IST
Telangana News Live: Vemulavada Murder: వేములవాడలో దారుణం, ఆస్తి కోసం ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ..దాడిలో భర్త మృతి..రెండో భార్య పరిస్థితి విషమం
- Vemulavada Murder: ఇద్దరు భార్యలు.. ఏడుగురు పిల్లలు...ఇద్దరు భార్యల మద్య ఆస్తి పంపకాల గొడవ కత్తిపోట్లకు దారి తీసి భర్త ప్రాణం తీసింది. రెండో భార్యను ఆసుపత్రి పాలు చేసింది. ఈ దారుణ ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ లో జరిగింది.
Mon, 30 Sep 202401:56 AM IST
Telangana News Live: TG DSC 2024 Results: నేడు తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్
- TG DSC 2024 Results: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించింది.
Mon, 30 Sep 202401:13 AM IST
Telangana News Live: Rape Case: యూ ట్యూబ్ ఫేమ్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు
- Rape Case: జగిత్యాల జిల్లాలో యూ ట్యూబ్ ఫేం ఫోక్ సాంగ్ సింగర్, రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ తేజ పై రేప్ కేసు నమోదు అయింది. ఫోక్ సాంగ్ సింగర్ అయిన యువతి పిర్యాదుతో జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon, 30 Sep 202401:03 AM IST
Telangana News Live: Jagityal Fake Notes: జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు కలకలం.. చిరు వ్యాపారులకు నకిలీ నోట్లు అంటగట్టిన కేటుగాళ్లు
- Jagityal Fake Notes:జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోటు కలకలం సృష్టిస్తున్నాయి. చిరు వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు నకిలీ నోట్లు చలామని చేస్తున్నారు. అసలు నకిలీ తేడా తెలియని అమాయకులు మోసపోయి ఆందోళన చెపుతున్నారు.