TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. దసరా రోజు పోస్టింగులు… లింక్ ఇదే
TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో విడుదల చేశారు. ఈ జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. 11వేల పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ పరీక్షల్ని నిర్వహించారు.
TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల విడుదలలో జాప్యం జరగడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫలితాలను విడుదలయ్యాయి.
తెలంగాణ డిఎస్సీ ఫలితాలను తెలుసుకోడానికి ఈ లింకును అనుసరించండి…
తెలంగాణ మెగా డిఎస్సీ 2024లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796పోస్టులు ఉన్నాయి.
2017 తర్వాత తెలంగాణలో డిఎస్సీ నియామకాలను 2024లోనే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 కేంద్రాల్లో డిఎస్సీ పరీక్షలను నిర్వహించారుే.
రికార్డు సమయంలో ఫలితాలు విడుదల…
తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.
మరోవైపు సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను కూడా వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఇటీవలనే టెట్ వివరాలను సవరించుకునే అవకాశం కూడా ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిం చింది. ఫలితాలు వీలైనంత త్వరగా విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షలు పూర్తై 3 వారాలు దాటడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. డిఎస్సీ 2024 ప్రాథమిక కీని ఆగస్టు 13న విడు దల చేశారు. ఆగస్టు 20 వరకూ ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు 28 వేల అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ విడుదల చేశారు.
మరోవైపు డీఎస్సీ జనరల్ ర్యాకిం గ్ జాబితాలు విడుదల చేస్తే నియామక ప్రక్రియ ముందుకు వెళుతుంది. ఖాళీలను బట్టి 33 జిల్లాల్లో ద్రువపత్రాల పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జాబితాలు వెళతాయి. ఈ మొత్తం ప్రక్రియకు మరో మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.