BJP MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! రెక్కీ నిర్వహించిన ఇద్దరు అరెస్టు-two persons were arrested near goshamahal bjp mla rajasingh house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! రెక్కీ నిర్వహించిన ఇద్దరు అరెస్టు

BJP MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! రెక్కీ నిర్వహించిన ఇద్దరు అరెస్టు

Basani Shiva Kumar HT Telugu
Sep 30, 2024 10:28 AM IST

BJP MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం సృష్టించింది. వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరి ఫోన్లు చెక్ చేయగా.. రాజాసింగ్ ఫొటోలు, గన్, బుల్లెట్ల ఫొటోలు కనిపించినట్టు తెలిసింది.

పోలీసుల అదుపులో రెక్కీ చేసిన ఇద్దరు వ్యక్తులు
పోలీసుల అదుపులో రెక్కీ చేసిన ఇద్దరు వ్యక్తులు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నాయి.

దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని రాజేంద్ర నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. 15 ఏళ్ల కిందట వీరు హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. వీరు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్దకు వచ్చారు.. వీరిని ఎవరు పంపించారు.. ఫోన్లలో రాజాసింగ్ ఫొటో ఎందుకు ఉందనే కోణంలో మంగళ్‌హాట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. 'సెప్టెంబర్ 27, 28 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీశారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఇద్దరు తప్పించుకున్నారు. వారు నా ఫోటోలు, నా ఇంటి స్థలాన్ని ముంబైలోని ఒకరికి పంపుతున్నారు. ఇద్దరు వ్యక్తులను మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు అని రాజా సింగ్' చెప్పారు.

'24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 2010లో కూడా నా ఇంటిపై నిఘా వేసి ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు చేశారు' అని ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు. గతంలో రాజాసింగ్ చాలాసార్లు చాలా అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓ మతం గురించి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. గణేష్ నిమజ్జనం విషయంలోనూ రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.