తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 27, 2024: Mulugu district : తాడ్వాయి అడవిలో ఆక్రమణ..! అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై ఇనుపరాడ్లతో దాడి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 27 Sep 202404:42 PM IST
Telangana News Live: Mulugu district : తాడ్వాయి అడవిలో ఆక్రమణ..! అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై ఇనుపరాడ్లతో దాడి
- ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో కొందరు వ్యక్తులు చెట్లను ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారు. జేసీబీ సాయంతో కొంత స్థలాన్ని చదును చేసి వెళ్తుండగా… అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. వెహికిల్ ను సీజ్ క్రమంలో సదరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
Fri, 27 Sep 202404:28 PM IST
Telangana News Live: Jagtial District : భార్య, భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ..! భర్త ఆత్మహత్య
- భార్య, భర్త గొడవ కేసులో ఓ లేడీ ఎస్ఐ తలదూర్చారు. విచారణ పేరిట స్టేషన్ కు పిలిపించి.. భార్య ముందే లాఠీ ఝులిపించారు. మనస్థాపం చెందిన భర్త.. ఈనెల 23 న ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఐ తీరుపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Fri, 27 Sep 202403:33 PM IST
Telangana News Live: Telangana Govt : సర్కార్ బడి పిల్లలకు అదిరిపోయే శుభవార్త - ఫ్రీగా చారిత్రక, పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు
- తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలను చూపించనుంది. ఇందుకోసం 'తెలంగాణ దర్శిని' పేరుతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
Fri, 27 Sep 202412:17 PM IST
Telangana News Live: Hyderabad : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. వీళ్లు మహా ముదుర్లు!
- Hyderabad : హైదరాబాద్ నగరంలో వీఐపీల ఇళ్లలో వరుస చోరీలు జరుగుతున్నాయి. మొన్న హీరో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగ్గా.. తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Fri, 27 Sep 202410:51 AM IST
Telangana News Live: Mahabubabad District : మంత్రాల నెపంతో దారుణ హత్య - వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
- మంత్రాల నెపంతో దారుణ హత్య జరిగింది. ఓ వృద్ధుడిని యువకుడు కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు… పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Fri, 27 Sep 202410:04 AM IST
Telangana News Live: Army Public School Jobs 2024 : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు -అర్హతలు, ముఖ్య వివరాలివే
- Secunderabad Army Public School : టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ RKపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ, ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.
Fri, 27 Sep 202408:24 AM IST
Telangana News Live: TGSRTC ITI Admissions : ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్! ఇలా దరఖాస్తు చేసుకోండి
- TGSRTC ITI Admissions 2024 : తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్ ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. హాకీంపేటలో ఉన్న కాలేజీలో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
Fri, 27 Sep 202407:49 AM IST
Telangana News Live: Medak Accident: మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బీవీఆర్ ఐటీ కళాశాల బస్సులు ఎదురెదురుగా ఢీ.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
- Medak Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కళాశాలకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక డ్రైవర్ తో సహా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
Fri, 27 Sep 202406:54 AM IST
Telangana News Live: Hydra Demolition : హైడ్రా బాధితుల కన్నీటి గాధలు.. ఎవరిదీ పాపం.. ఎందుకీ శాపం?
- Hydra Demolition : హైడ్రా.. ఈ పేరు వింటే ఇన్నాళ్లు అక్రమ కట్టడాలు నిర్మించిన బడా బాబులు భయపడేవారు. ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా.. మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే చేపట్టారు. ఈ క్రమంలో ఎందరో కన్నీరు పెట్టుకుంటున్నారు.
Fri, 27 Sep 202406:11 AM IST
Telangana News Live: Reliance Foundation : తెలంగాణకు రూ.20 కోట్ల భారీ విరాళం అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్
- Reliance Foundation : తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అపార నష్టం వాటిళ్లింది. ఈ నేపథ్యంలో దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా.. రిలయన్స్ ఫౌండేషన్ తెలంగాణకు భారీ విరాళాన్ని అందజేసింది.
Fri, 27 Sep 202405:29 AM IST
Telangana News Live: TG MBBS Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం
- TG MBBS Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో భాగంగా కన్వీనర్ కోటా సీట్లకు సెప్టెంబర్ 27 శుక్ర వారం నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచే సింది.
Fri, 27 Sep 202405:15 AM IST
Telangana News Live: Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
- Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన బంధువులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.
Fri, 27 Sep 202404:44 AM IST
Telangana News Live: TG Indiramma Houses : ఒకేసారి 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులను ఎంపిక చేసేది వీరే!
- TG Indiramma Houses : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పెరిగాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చూసే వారికి ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఒకేసారి ఏకంగా 10 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది.
Fri, 27 Sep 202404:11 AM IST
Telangana News Live: TG MBBS Admission 2024 : ఇవాళ్టి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు.. ఆఖరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే
- TG MBBS Admission 2024 : తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వివరించారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు.
Fri, 27 Sep 202401:57 AM IST
Telangana News Live: BRS KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు... మా టైం వస్తుంది, అందర్నీ గుర్తు పెట్టుకుంటామన్న కేటీఆర్
- BRS KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు... మా టైం వస్తుంది... ఇప్పుడు ఎవరెవరు అతిగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తుంచుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ హెచ్చరించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ మేము అధికారంలోకి వస్తామని అప్పుడు ఎవరిని వదిలిపెట్టమన్నారు.
Fri, 27 Sep 202411:39 PM IST
Telangana News Live: Prices Increase: 22 శాతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పండుగ పూట పెరిగిన ధరలతో సర్వత్రా ఆందోళన
- Prices Increase: పండుగల వేళ నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పప్పు, వంట నూనెల ధరలు 22 శాతం పెరిగాయి. ఉల్లి సెంచరీకి చేరువలో ఉండగా, ఎల్లిపాయలు 400 ధర పలుకుతుంది. ఇక పప్పు వంటనూనెల ధరలు కేజీకి 20 రూపాయల వరకు పెరిగింది.