TGSRTC ITI Admissions : ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్! ఇలా దరఖాస్తు చేసుకోండి-notification for admissions in rtc iti college hakimpet key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Iti Admissions : ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్! ఇలా దరఖాస్తు చేసుకోండి

TGSRTC ITI Admissions : ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్! ఇలా దరఖాస్తు చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 27, 2024 01:54 PM IST

TGSRTC ITI Admissions 2024 : తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్ ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. హాకీంపేటలో ఉన్న కాలేజీలో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఐటీఐ ట్రేడ్ ప్రవేశాలు - ఆర్టీసీ ప్రకటన
ఐటీఐ ట్రేడ్ ప్రవేశాలు - ఆర్టీసీ ప్రకటన

ఐటీఐ విద్యను అభ్యసించే వారికి  తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆసక్తి గల విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని కల్పిస్తారు.  అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 28 తేదీలోపు https://iti.telangana.gov.in  లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

మెకానిక్ డిజీల్, మెకానిక్ మోటార్ వెహికిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లో ప్రవేశాలు ఉంటాయి. మెకానిక్ డీజిల్ కోర్సు వ్యవధి ఏడాది మాత్రమే ఉంటుంది. మోటర్ వెహికిల్ మెకానిక్ 2 సంవత్సరాలు ఉంటుంది. వెల్డర్ ఒక ఏడాది, పెయింటర్ రెండేళ్ల వ్యవధి ఉంటుంది. పూర్తి వివరాలకు 9100664452, 040 -2345 -0033 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా zstchpt@gmail.com కు మెయిల్ కూడా చేయవచ్చు.