Army Public School Jobs 2024 : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు -అర్హతలు, ముఖ్య వివరాలివే
Secunderabad Army Public School : టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ RKపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ, ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.
సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. నాలుగు పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పోస్టు ఉండగా… కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ చేస్తారు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ-ఇంగ్లిష్) కూడా కేవలం ఒక పోస్టు మాత్రమే ఉంది. అడహక్ విధానంలో రిక్రూట్ చేస్తారు. ఇక ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు 2 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను కూడా అడహక్ విధానంలోనే భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apsrkpuram.edu.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అర్హతలు - టీజీటీ ఉద్యోగాలకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.42,400 జీతం చెల్లిస్తారు. టీజీటీ పోస్టుల వారికి రూ.38,000, ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు రూ.20,000 ఇస్తారు. దరఖాస్తు చేసుకునే వాళ్లు రూ. 250 డీడీ చెల్లించాలి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.ృ
వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను నింపి ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం, సికింద్రాబాద్’ చిరునామాకు పంపించాలి. https://apsrkpuram.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన :
మరోవైప దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వివరాలను ప్రకటించింది. ఇందులో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను రిక్రూట్ చేయనుంది. డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రాతపరీక్షతో పాటు టీచింగ్ స్కిల్క్ ఆధారంగా తుది నియామకాలు ఉంటాయి. అప్లయ్ చేసుకునే అభ్యర్థులు 01-04-2024 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్ ను పరీక్షా కేంద్రంగా ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా పలు సెంటర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం హైదరాబాద్ మాత్రమే సెంటర్ గా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 41 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరగనుంది.
ఇందుకు సంబంధించిన పరీక్షలు నవంబర్ 23, 24 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 25వ తేదీని పరీక్ష రిజర్వ్ డేగా ప్రకటించారు. తుది ఫలితాలను డిసెంబర్ 10వ తేదీన ప్రకటిస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు https://www.awesindia.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్ నుంచే హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.