BC Overseas Scholarships : విదేశాల్లో చదవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విద్యానిధి దరఖాస్తులు ప్రారంభం-jyothiba phule overseas vidya nidhi for bc and ebc students last date for applications is october 15 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bc Overseas Scholarships : విదేశాల్లో చదవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విద్యానిధి దరఖాస్తులు ప్రారంభం

BC Overseas Scholarships : విదేశాల్లో చదవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విద్యానిధి దరఖాస్తులు ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 19, 2024 03:24 PM IST

BC Overseas Vidya Nidhi Scholarship : తెలంగాణలో బీసీ, ఈబీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ అయింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది.

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫులే విదేశీ విద్యా పథకానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు అక్టోబర్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 

అర్హులైన అభ్యర్థులు  https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాలమాయాదేవి పేర్కొన్నారు.విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్ధుల కోసం ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు.  ఈ ఫాల్ సీజన్‌‌(August/September-2024)లో అడ్మిషన్లు పొందే బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ఈ స్కీమ్ ద్వారా ఆర్ధిక సాయం అందిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 35ఏళ్లకు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం  రూ.5 లక్షలను దాటకూడదు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు విదేశీ విద్యానిధి ద్వారా సాయం పొందడానికి అర్హులు అవుతారు.

విదేశీ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఐ 20 ఇన్విటేషన్‌ ఉన్నవారు, వీసాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు ఈ పథకం వర్తిస్తుంది.

రూ. 20 లక్షల ఆర్థిక సాయం..!

ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్‌ఈ, జి మ్యాట్‌ స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటారు.

అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిథి పధకంలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్‌, పిటిఇలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్‌ ఎంపికలో స్కోర్‌ పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల్లోఅడ్మిషన్‌ పొందే యూనివర్శిటీల్లో స్కోర్‌ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.

మరోవైపు ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/  వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది.

  • ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థి సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలోపు మాత్రమే ఉండాలి.
  • ఈ స్కీమ్ లో భాగంగా అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లొచ్చు.
  • ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ. 20 లక్షల వరకు ఉపకార వేతనం పొందవచ్చు.
  • కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
  • గ్రాడ్యూయేషన్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. GRE/GMAT లో అర్హత స్కోర్ ఉండాలి.

ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్‌ఈ, జి మ్యాట్‌ స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటారు.