TG MBBS Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం-registration of web options for mbbs and bds admissions has started in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mbbs Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

TG MBBS Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 27, 2024 10:59 AM IST

TG MBBS Web Option: తెలంగాణలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో భాగంగా కన్వీనర్ కోటా సీట్లకు సెప్టెంబర్ 27 శుక్ర వారం నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచే సింది.

కాళోజీ యూనివర్శిటీ మెడికల్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు
కాళోజీ యూనివర్శిటీ మెడికల్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు

మెయిTG MBBS Web Option: తెలంగాణలో నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం జారీ చేసిన మెరిట్ లిస్ట్‌ ఆధారంగా కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపు కోసం వెబ్‌ ఆప్షన్లను విద్యార్ధులు సెప్టెంబర్ 27 శుక్రవారం ఉదయం 6 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు విద్యార్థులు తమ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కన్వీనర్ కోటాలో భాగంగా కాంపిటెంట్ అధారిటీ కోటాలో భాగమైన దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడినవారు, పోలీస్‌ అమరవీరుల పిల్లలు, సాయుధ బలగాల సంతానమైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు, ఆన్ఎయిడెడ్, మైనార్టీ నాన్ మైనార్టీ వైద్య కళాశాలల్లోని కస్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ జాబితా కాళోజీ వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. వెబ్‌ఆప్షన్లలో ర్యాంకుల ఆధారంగా యూనివర్శిటీ సీటు కేటాయించిన విద్యార్థులు రూ. 12 వేలు చెల్లించి ఎలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు రూ.10 వేలుగా ఉంది. ప్రైవేటు వైద్యకళాశాలల్లో రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈఎస్ఐ కాలేజీలో ఫీజు రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో కన్వీనర్ కోటా సీట్లకు వెట్అప్షన్లు ఇవ్వని విద్యార్థులకు తర్వాతి రౌండ్లలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. మొదటి రౌండ్లో ఎంబీబీఎస్ సీటు వచ్చిన విద్యార్థులు అయా కళాశాలలో చేరకపోతే తర్వాత రౌండ్లలో కౌన్సిలింగ్‌కు అర్హత ఉండదని యూనివర్శిటీ స్పష్టం చేసింది. జీవో నంబర్ 33పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించి కౌన్సిలింగ్‌లోపాల్గొంటున్న అభ్యర్థులు హైకోర్టులో పెండింగ్ కేసుల తీర్పునకు లోబడి కేటాయింపులు, అడ్మిషన్లు చేస్తారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కోరుతున్న విద్యార్థులు ఈ లింకు ద్వారా https://tsmedadm.tsche.in/entryregcanddisp.php వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలో జనరల్ విద్యార్థులకు కటాఫ్‌ మార్కులుగా 162, ఎస్సీ,‎ఎస్టీ, బీసీలకు 127, దివ్యాంగులకు 144గా నిర్ణయించారు.

అందుబాటులో ఉన్న సీట్లు...

తెలంగాణలో వైద్య కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కేటగిరీల వారీగా సూచిస్తూ కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో సీట్ మ్యాట్రిక్స్ వివరాలు అందుబాటులో ఉంచింది. ఏ కళాశాలలో ఏ కేటగిరీకి ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయనే వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ సీట్ల కోటా వివరాలను ప్రత్యేకంగా విడుదల చేశారు.

తెలంగాణలో 30 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 22 ప్రైవేటు వైద్య కళాశాలలు, మరో ము 4 ముస్లిం మైనార్టీ కాలేజీల్లో తాజా కౌన్సిలింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16694 మంది విద్యార్థుల తుది మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

వెబ్‌ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన సమస్యలకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

7901098840, 9490585796 Emailఫ knrugadmission@gmail.com

సాంకేతిక సమస్యలకు : 9392685856, 7842136688 and 9059672216

వెబ్‌ ఆఫ్షన్ల నమోదులో తలెత్తే సమస్యలను tsmedadm2024@gmail.com కు ఈ మెయిల చేయొచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కోసం 9866092370 నంబరును సంప్రదించాలి.