Hyderabad : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. వీళ్లు మహా ముదుర్లు!-theft in the house of deputy cm bhatti vikramarka in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. వీళ్లు మహా ముదుర్లు!

Hyderabad : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. వీళ్లు మహా ముదుర్లు!

Basani Shiva Kumar HT Telugu
Sep 27, 2024 05:47 PM IST

Hyderabad : హైదరాబాద్ నగరంలో వీఐపీల ఇళ్లలో వరుస చోరీలు జరుగుతున్నాయి. మొన్న హీరో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగ్గా.. తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు
పోలీసుల అదుపులో నిందితులు

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల హీరో మోహన్ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లోనే దొంగతనం చేశాడు. నాయక్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల రాత్రిపూట దాదాపు రూ.10 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇది గమనించిన మోహన్ బాబు.. వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 10 గంటల్లోనే నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేశారు.

ఇటీవల హైదరాబాద్ శివారులో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరి జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో దొంగలు రెండు కోట్ల నగద తోపాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు. నాగభూషణం ఉదయం పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు.

రూ.రెండు కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు వాపోయాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌టీం సాయంతో విచారణ చేపట్టారు. తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగభూషణం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.