Mohan Babu Rajinikanth: స్నేహమేరా జీవితం అంటున్న మోహన్ బాబు.. రజనీకాంత్‌తో ఫొటో వైరల్-mohan babu rajinikanth photo gone viral both actors travelled back to hyderabad from chennai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohan Babu Rajinikanth: స్నేహమేరా జీవితం అంటున్న మోహన్ బాబు.. రజనీకాంత్‌తో ఫొటో వైరల్

Mohan Babu Rajinikanth: స్నేహమేరా జీవితం అంటున్న మోహన్ బాబు.. రజనీకాంత్‌తో ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu

Mohan Babu Rajinikanth: మోహన్ బాబు, రజనీకాంత్ ఎంతో ఆత్మీయంగా కలిసి ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వస్తున్న సమయంలో దిగిన ఫొటో ఇది.

స్నేహమేరా జీవితం అంటున్న మోహన్ బాబు.. రజనీకాంత్‌తో ఫొటో వైరల్

Mohan Babu Rajinikanth: స్నేహమేరా జీవితం అంటున్నాడు టాలీవుడ్ స్టార్ నటుడు మంచు మోహన్ బాబు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో తాను కలిసి ఉన్న ఫొటోను ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఇద్దరి మధ్య ఎంతటి ఆత్మీయ బంధం ఉందో ఈ ఫొటో ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ చెన్నైలో వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తూ ఇలా కనిపించారు.

స్నేహమేరా జీవితం

విమానంలో రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను మోహన్ బాబు తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో రజనీ ఎంతో ఆప్యాయంగా మోహన్ బాబుపై ఓ చేయి వేసి.. మరో చేత్తో అతని గడ్డం పట్టుకోవడం చూడొచ్చు. ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. "అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం" అనే క్యాప్షన్ ఉంచడం విశేషం.

ఈ ఫొటోలో ఇద్దరూ ఆటవిడుపుగా కనిపించారు. వీళ్ల ప్రయాణం కూడా చాలా సరదాగా సాగిపోయినట్లు ఈ ఫొటో చూస్తే స్పష్టమవుతోంది. అంతకుముందు ఈ ఇద్దరు నటులు చెన్నై ఎయిర్ పోర్టు దగ్గర ఓ గుర్రపు బగ్గీలో కనిపించిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ ఇద్దరూ వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరై తిరిగి వస్తూ ఇలా కనిపించారు.

రజనీ, మోహన్ బాబు స్నేహం ఇలా..

రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం ఇప్పటి కాదు. నాలుగు దశాబ్దాలుగా వాళ్లు మంచి స్నేహితులుగా ఉన్నారు. తమ కెరీర్ తొలినాళ్లలో వీళ్లు క్లోజ్ ఫ్రెండ్స్. ధర్మ యుద్దం, పెదరాయుడులాంటి సినిమాల్లోనూ కలిసి నటించారు. ఒకప్పుడు ఒక్క టీని పంచుకున్న ఈ ఇద్దరూ తర్వాత ఎలా సూపర్ స్టార్లుగా ఎదిగారో గతంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి వెల్లడించింది.

"ఒక టీని ఇద్దరూ షేర్ చేసుకున్నారు. కారు షెడ్లలో కలిసి ఉన్నారు. ఇద్దరూ ఒకే నేపథ్యం నుంచి వచ్చారు. ఇప్పుడు ఇద్దరూ సూపర్ స్టార్లే. అయినా టైమ్ ఉన్నప్పుడల్లా ఇద్దరూ కాల్ చేసి మాట్లాడుకుంటారు" అని లక్ష్మి చెప్పింది. ఇద్దరు స్నేహితులు సుదీర్ఘ కాలం పాటు తమ స్నేహాన్ని కొనసాగిస్తారనడానికి ఈ ఇద్దరే నిదర్శనం అని కూడా ఆమె తెలిపింది.

రజనీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్, లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న వెట్టైయన్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. మరోవైపు మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.