తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 17, 2024: Peeing In Public 30k Fine : మద్యం మత్తులో బహిరంగంగా మూత్ర విసర్జన, రూ.30 వేలు ఫైన్ విధించిన అధికారులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 17 Sep 202404:50 PM IST
Telangana News Live: Peeing In Public 30k Fine : మద్యం మత్తులో బహిరంగంగా మూత్ర విసర్జన, రూ.30 వేలు ఫైన్ విధించిన అధికారులు
- Peeing In Public 30k Fine : ఫుల్లుగా తాగి బహిరంగంగా మూత్రవిసర్జన చేసి ఓ వ్యక్తికి సివిక్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.30 వేలు ఫైన్ విధించారు. ఈ ఘటన సోమవారం రాత్రి సంగారెడ్డిలో జరిగింది. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో మూత్రవిసర్జన చేయడం ఫైన్ కు దారితీసింది.
Tue, 17 Sep 202403:18 PM IST
Telangana News Live: AV Ranganath On Bulldozer Verdict : బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు, ఏవీ రంగనాథ్ వివరణ
- AV Ranganath On Bulldozer Verdict : బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. కూల్చివేతాలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపునకు ఈ ఆదేశాలు వర్తించవని సుప్రీం తెలిపిందన్నారు.
Tue, 17 Sep 202402:28 PM IST
Telangana News Live: Karimnagar Ganesh Nimajjanam : గంగమ్మ ఒడికి గణనాథుడు, కరీంనగర్ లో రెండు రోజులపాటు సాగిన నిమజ్జనోత్సవం
- Karimnagar Ganesh Nimajjanam : నవరాత్రులు పూజలందుతున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. కరీంనగర్ వ్యాప్తంగా నిమజ్జనాలు వైభవంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలో 10,325 వినాయకుడి విగ్రహాలను భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనాలు చేశారు.
Tue, 17 Sep 202402:13 PM IST
Telangana News Live: Minister Sridhar Reddy : 100 రోజుల్లో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పండి- బండి సంజయ్ కు మంత్రి శ్రీధర్ బాబు సవాల్
- Minister Sridhar Reddy : ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మంత్రి శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Tue, 17 Sep 202411:48 AM IST
Telangana News Live: Hyderabad Police : హైదరాబాద్‌లో రేపు ఉదయం వరకు నిమజ్జనం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!
- Hyderabad Police : హైదరాబాద్ మహా నగరంలో గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రేపు ఉదయం వరకు నిమజ్జం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
Tue, 17 Sep 202411:15 AM IST
Telangana News Live: Harish Rao : పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిండు కదా.. మీరెందుకు ఇవ్వరు.. రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
- Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు మాజీమంత్రి హరీష్ రావు. ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు 4 వేలు పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Tue, 17 Sep 202409:32 AM IST
Telangana News Live: TG Govt : భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్
- TG Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
Tue, 17 Sep 202409:17 AM IST
Telangana News Live: TG Rain Alert : తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు వర్షాలు!
- TG Rain Alert : ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు సంభవించాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఆ నష్టం నుంచి తేరుకోకముందే.. మళ్లీ వర్షాలు కురుస్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి.. అక్టోబర్ 10వ తేదీ వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Tue, 17 Sep 202408:19 AM IST
Telangana News Live: Khairatabad Ganesh Nimajjanam : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి, వేలాదిగా తరలివచ్చిన భక్తులు
- Khairatabad Ganesh Nimajjanam : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభయాత్ర వేలాది భక్తుల సందడి మధ్య మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేష్ నిమజ్జనం పూర్తైంది.
Tue, 17 Sep 202406:48 AM IST
Telangana News Live: Adilabad News: గణపతి నిమజ్జనం కోసం భారీ పోలీసు బందోబస్తు..
- Adilabad News: గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మల్టీ జోన్ వన్ ఐజి ఎస్. చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
Tue, 17 Sep 202406:02 AM IST
Telangana News Live: Balapur Laddu : బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట.. ఈసారి రికార్డు స్థాయి ధర.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
- Balapur Laddu : బాలాపూర్ గణేశ్ లడ్డూ.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈసారి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటలో కొత్త రికార్డ్ నమోదైంది. ఏకంగా రూ.30 లక్షలు వేలంపాడి లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి.
Tue, 17 Sep 202405:47 AM IST
Telangana News Live: September 17th : మట్టి మనుషులు చేసిన యుద్ధం.. ఓరుగల్లు చరిత్రకు అద్దం
- September 17th : నిజాం పాలన.. తెలంగాణ చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. పల్లెల్లో మహిళల బట్టలిప్పి బతుకమ్మ ఆడించారు. అంతటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి మట్టి మనుషులు యుద్ధం చేశారు. వారి తిరుగుబాటుకు తిలకం దిద్దింది ఓరుగల్లు.
Tue, 17 Sep 202405:30 AM IST
Telangana News Live: Kishan Reddy: పరేడ్ గ్రౌండ్స్‌లో శాశ్వతంగా హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి
- Kishan Reddy: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ముక్తి దివాస్‌ను శాశ్వతంగా భారత ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను భావి తరాలకు అందిస్తామన్నారు.
Tue, 17 Sep 202404:57 AM IST
Telangana News Live: Prajapalana Dinotsavam: కాలు కదపకుండా పాలించడానికి, ఫామ్ హౌస్ సీఎంను కాదన్న రేవంత్ రెడ్డి, ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
- Prajapalana Dinotsavam: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగరేశారు.
Tue, 17 Sep 202404:33 AM IST
Telangana News Live: TG LAWCET 2024 : నేటి నుంచి టీజీ లాసెట్ - 2024 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొండి..
- TG LAWCET 2024 : టీజీ లాసెట్ - 2024 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ చేసుకోవాలని సూచించారు.
Tue, 17 Sep 202404:21 AM IST
Telangana News Live: Revanth Reddy Grandson : వినాయకుడి నిమజ్జనంలో డాన్స్ అదరగొట్టిన రేవంత్ రెడ్డి మనవడు!
- Revanth Reddy Grandson : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జమం సందడి నెలకొంది. గణపతి నిమజ్జనం సందర్భంగా చిన్నాపెద్దా అంతా కలిసి తీన్‌మార్ డ్యాన్స్‌లు వేస్తూ.. బొజ్జ గణపయ్యకు విడ్కోలు పలుకుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మనవడు వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ వేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tue, 17 Sep 202403:56 AM IST
Telangana News Live: Attack on Doctor: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై అర్థరాత్రి దౌర్జన్యం, ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
- Attack on Doctor: దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో కూడా తరచూ వైద్యులపై దాడులు, రోగుల బంధువుల దురుసు ప్రవర్తిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఏలూరులో మహిళా డాక్టర్‌పై దౌర్జన్యంపై బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
Tue, 17 Sep 202402:35 AM IST
Telangana News Live: Bandi Sanjay: తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి విమోచన దినం జరపడం లేదన్న బండి సంజయ్
- Bandi Sanjay: ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజా పాలన దేనికోసం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Tue, 17 Sep 202401:05 AM IST
Telangana News Live: BRSV Protest: సీఎం రేవంత్‌పై చర్యలకు బీఆర్‌ఎస్ డిమాండ్, సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదులు
- BRSV Protest: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చట్టరిత్య చర్యలు తీసుకోవాలని చిన్న కోడూరు SI చిన్న కోడూరు మండల BRS విద్యార్థి యువజన విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు.