Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ప్రధాని మోదీకి అంకితం.. ప్రత్యేకతలివే!-balapur ganesh laddu fetched a record price this time ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ప్రధాని మోదీకి అంకితం.. ప్రత్యేకతలివే!

Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ప్రధాని మోదీకి అంకితం.. ప్రత్యేకతలివే!

Basani Shiva Kumar HT Telugu
Sep 17, 2024 11:32 AM IST

Balapur Ganesh Laddu: బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈసారి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటలో కొత్త రికార్డ్ నమోదైంది. ఏకంగా రూ.30 లక్షలు వేలంపాడి లడ్డూను దక్కించుకున్నారు. కొలను శంకర్ రెడ్డి.

బాలాపూర్ లడ్డూతో శంకర్ రెడ్డి
బాలాపూర్ లడ్డూతో శంకర్ రెడ్డి

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. 30 లక్షల వెయ్యి రూపాయలు పలికింది. బాలాపూర్‌ లడ్డూను కొలను శంకర్‌రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.27 లక్షల ధర పలికింది. అప్పుడు స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. 'బాలాపూర్ లడ్డూ ప్రధాని మోదీకి అంకితం.. పూర్తి లడ్డూను ఢిల్లీకి వెళ్లి మోడీకి అందజేస్తా' అని కొలను శంకర్ రెడ్డి ప్రకటించారు.

yearly horoscope entry point

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన పెట్టారు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్‌ చేయాలని షరతు విధించారు. ఈ ఏడాది లడ్డూ రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేశారు. ఆశించినట్టుగానే లడ్డూ ధర రూ.30 లక్షలు పలికింది. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో 23 మంది పాల్గొన్నారు. లడ్డూ వేలం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

లడ్డూ వేలంపాట ముగియడంతో.. శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ట్యాంక్‌బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర సాగనుంది. 16 కిలోమీటర్లు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర సాగనుంది. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. భక్తులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సచివాలయం వద్ద పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఖైరతాబాద్ గణేష్‌ను చూడడానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంగణంలోకి పలువురు దూకారు. ఒక్కసారిగా భారీగా జనం గేటు దూకడంతో.. పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే వారందరిని బయటకు పంపారు.

Whats_app_banner