Hyd Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు -traffic restrictions in hyderabad on thursday over sri ram navami procession ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyd Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 01:35 PM IST

Sri Ram Navami Shobha Yatra 2023: హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ ఇచ్చింది ట్రాఫిక్ పోలీస్ విభాగం. గురువారం శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (twitter)

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గురువారం శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా గోషామహల్‌, సల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్లపరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌ ఆలయం వద్ద ఈ శోభాయాత్ర ప్రారంభం కానుంది. బోయగూడ, మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్ర చేరుతుంది. ఫలితంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల దారి మళ్లింపు కూడా ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

ఈ మార్గాల్లోనే కాకుండా నగరంలోని పలు చోట్ల శోభాయాత్రలు తలపెట్టిన కారణంగా… ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పారు.

3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు...

ఇదిలా ఉంటే నగరంలోని కొన్ని ప్రాంతాలల్లో 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల్లో మార్చి 28 నుంచి జూలై 28 వరకు సుమారు 3 నెలలపాలు ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో 90 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదలైంది. మెట్రో స్టేషన్ వద్ద ఏజీ కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల నిమిత్తం దాదాపు మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేయనున్నారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం