TG Govt : భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్-khammam dy cm bhatti vikramarka says land less farmers get 12k for year new scheme will start ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt : భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్

TG Govt : భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్

Bandaru Satyaprasad HT Telugu
Sep 17, 2024 03:10 PM IST

TG Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్
భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్

TG Govt : తెలంగాణ సర్కార్ రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... మీడియాతో మాట్లాడుతూ ప్రజల చేత, ప్రజల అవసరాల కోసం ఏర్పడిందే ఈ ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. భారత రాజ్యాంగం మేరకు ప్రజాపాలన నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యాని గౌరవించే ప్రతి ఒక్కరు ప్రజాపాలనను స్వాగతించాలని కోరారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చూశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి పాలనా నుంచి నేడు విముక్తి పొందామన్నారు. ప్రజాపాలనలో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. రైతులకు పంట బీమా, వ్యక్తిగత ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామన్నారు. దీంతో పాటు సోలార్ పంపు సెట్లతో ఆదాయం వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. అలాగే భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఐకేపీ ద్వారా మహిళలు ఆర్గానిక్ ఫార్మిగ్ చేసేలా కృషి చేస్తున్నామన్నారు. పక్కదారి పట్టిన దళిత బంధు యూనిట్లు తిరిగి అమల్లోకి తెచ్చే బాధ్యత అధికారులదే అన్నారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు(సన్న రకం ధాన్యం) 500 రూపాయల బోనస్ ను చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతులకు హామీలు ఇచ్చారు. వీటిల్లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరి పంటకు రూ.500 బోనస్. తాజాగా బోనస్ పై ప్రభుత్వం ప్రకటన చేసింది.

సంబంధిత కథనం