BRSV Protest: సీఎం రేవంత్‌పై చర్యలకు బీఆర్‌ఎస్‌ డిమాండ్, సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదులు-brs demands action against cm revanth complains to police in siddipet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brsv Protest: సీఎం రేవంత్‌పై చర్యలకు బీఆర్‌ఎస్‌ డిమాండ్, సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదులు

BRSV Protest: సీఎం రేవంత్‌పై చర్యలకు బీఆర్‌ఎస్‌ డిమాండ్, సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదులు

HT Telugu Desk HT Telugu
Sep 17, 2024 06:35 AM IST

BRSV Protest: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చట్టరిత్య చర్యలు తీసుకోవాలని చిన్న కోడూరు SI చిన్న కోడూరు మండల BRS విద్యార్థి యువజన విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు.

రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్వీ నేతల ఫిర్యాదు
రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్వీ నేతల ఫిర్యాదు

BRSV Protest: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చట్టరిత్య చర్యలు తీసుకోవాలని చిన్న కోడూరు SI చిన్న కోడూరు మండల BRS విద్యార్థి యువజన విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లో కూడా BRSV నాయకులూ ముఖ్యమంత్రి పైన సోమవారం రోజు ఫిర్యాదు చేశారు.

అసభ్య పదజాలంపై క్షమాపణ చెప్పాలి.…

BRS మండల విద్యార్ధి విభాగం అధ్యక్షులు గుజ్జ రాజు, యువజన విభాగం అధ్యక్షులు గుండవెల్లి వేణు మాట్లాడుతు గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్ లలో ప్రతిపక్ష పార్టీ అయినా BRS నాయకుల పైన అసభ్య పదజాలంతో మాట్లాడడం తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయాలకు భిన్నంగా మీ అంతు చూస్తాము, మగాడివైతే రా చూసుకుందాం, నన్ను ముట్టుకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు మానవ బాంబులై మీ అంతు చూస్తాం అనడం, లాగుల్లో తొండలు జోర్రిస్తాం, పేగులు మెడలో వేసుకుంటాం, గుడ్లు పీకి గోటిలు ఆడుతామని అసభ్య పదజాలంతో ప్రతిపక్షం పైన చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గాంధీభవన్లో సమావేశంలో సంక నాకనికి పోయిండ్రా అంటూ అసభ్య పదజాలంతో మాజీ మంత్రి హరీష్ రావుపై వ్యక్తిగత దుర్భాషలడుతూ మాట్లాడడం సరి కాదని ఇప్పటికైనా తను మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోవాలని సీఎంను హెచ్చరిస్తున్నామన్నారు. సీఎం పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని చిన్నకోడూరు ఎస్ఐ ఫిర్యాదు చేశామని బీఆర్‌ఎస్వీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి సుధాకర్, పడిగే లింగం, మన్నే ఆనంద్, చెట్టుపల్లి భానుచందర్, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్, పిట్లప్రేమ్,జగన్, యువజన, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

అనుచిత అసభ్య వ్యాఖ్యలు సరికావు..

సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ సిఐ ఫిర్యాదు చేయడం చేశారు.బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రూరల్ మండల అధ్యక్షులు బండి శ్రీకాంత్ ముఖ‌్యమంత్రి తీరును తప్పు పట్టారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు లను ఎన్నోసార్లు రాయడానికి వీలు లేనటువంటి భాషలో మాట్లాడారని , ఇప్పుడు బాధ్యతాయుతమైన సీఎం హోదాలో ఉండి కూడా అదే భాషను ఉపయోగించడం బాధాకరమన్నారు.

మేము కూడా అలాంటి భాషా ఉపయోగిస్తాం.…

రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలు పునారావృతం చేస్తే, సాధారణ పౌరులైనటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలం సైతం అటువంటి భాషను ఉపయోగించాల్సి వస్తుందని, ఇప్పటికైనా సిఎం అలాంటి పదాలు మానుకోవాలని ఆరడుగులు ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎత్తు గురించి మూడు అడుగులు ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.

Whats_app_banner