Peeing In Public 30k Fine : మద్యం మత్తులో బహిరంగంగా మూత్ర విసర్జన, రూ.30 వేలు ఫైన్ విధించిన అధికారులు
Peeing In Public 30k Fine : ఫుల్లుగా తాగి బహిరంగంగా మూత్రవిసర్జన చేసి ఓ వ్యక్తికి సివిక్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.30 వేలు ఫైన్ విధించారు. ఈ ఘటన సోమవారం రాత్రి సంగారెడ్డిలో జరిగింది. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో మూత్రవిసర్జన చేయడం ఫైన్ కు దారితీసింది.
Peeing In Public 30k Fine : బహిరంగంగా మూత్రవిసర్జన చేసిన ఓ వ్యక్తికి రూ.30 వేల ఫైన్ విధించారు అధికారులు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు అతడికి రూ.30,000 జరిమానా విధించారు. ఆర్ అండి బి గెస్ట్ హౌస్‌లో బస చేసిన జిల్లా సీనియర్ అధికారి ఒకరు.... ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని గమనించారు. అతడిని నిలదీయడంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి... అధికారి అని తెలియక తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ అధికారి స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తికి రూ.30,000 భారీ జరిమానా విధించారు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అధికారులు ముందు తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇక హైదరాబాద్‌లో అయితే తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేవని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఉన్న కొన్ని పబ్లిక్ టాయిలెట్లు కూడా కంపుకొడుతున్నాయని, వాటి నిర్వహణ సరిగ్గా లేదని మండిపడుతున్నారు. ఇందులో ప్రభుత్వం, ప్రజలు ఇద్దరి నిర్లక్ష్యం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మూత్రవిసర్జన ఘటన-కోర్టు వరకూ
లెనోవో కంప్యూటర్ సేల్స్‌మాన్ రిచర్డ్ బెకర్ న్యూయార్క్ లోని ఓ హోటల్ లాబీలో మూత్రవిసర్జన చేశాడు. దీంతో లెనోవో సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. రిచర్జ్ బెకర్ అమెరికా ఫెడరల్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తనకు 1.5 మిలియన్ల డాలర్ల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూయార్క్ నగర మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ తనను ఉద్యోగం నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.
'రిచర్డ్ బెకర్ ఫిబ్రవరిలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సమీపంలోని ఓ హోటల్ లాబీలో మూత్రవిసర్జన చేశాడు. సహోద్యోగి ఒకరు బెకర్ మూత్ర విసర్జన చేయడాన్ని గమనించి, వెంటనే కంపెనీ హెచ్ఆర్ కు నివేదించారు. అయినప్పటికీ బెకర్ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు' అని బెకర్ తరఫు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నాడు. బెకర్ 2016 నుంచి దీర్ఘకాలిక మూత్రాశయ వ్యాధితో బాధపడుతున్నారని, యూరాలజిస్ట్ చికిత్సలో ఉన్నారని కోర్టు తెలిపారు. అతని పరిస్థితి గురించి లెనోవా సంస్థ నిర్వాహకులకు, సహోద్యోగులకు తెలుసని పిటిషన్ లో పేర్కొన్నారు. బెకర్ నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఉద్యోగం నుంచి తొలగించారని పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
సంబంధిత కథనం