Sangareddy Damage: సంగారెడ్డి లో 130 ఇండ్లు ముంపుకు గురయ్యాయి: మంత్రి దామోదర రాజనరసింహ
Sangareddy Damage: సంగారెడ్డి పట్టణం సిద్దిపేట, వరంగల్ పట్టణాలలా అభివృద్ధి చెందేలా ప్రణాళికల రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Sangareddy Damage: సంగారెడ్డి పట్టణంతో పాటు సిద్దిపేట, వరంగల్ పట్టణాలలా అభివృద్ధి చెందేలా ప్రణాళికల రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశమందిరంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిపి సంగారెడ్డి పట్టణ అభివృద్ధి పై ఆర్ అండ్ బి మున్సిపల్ ఇరిగేషన్ ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడారు.
హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న సంగారెడ్డి పట్టణం గత పది సంవత్సరాలలో అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు.సంగారెడ్డి పట్టణం,సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల పట్టణాలలా ఎందుకు అభివృద్ధి చెందలేదని అధికారులను ప్రశ్నించారు.
ప్రణాళికలు రూపొందించాలి..
సంగారెడ్డి అభివృద్ధి చెందేలా అధికారులు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.పట్టణంలో బటర్ ఫ్లై లైట్లు పార్కులో ఏర్పాటు, పట్టణ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్ ల ఏర్పాటు తదితర అభివృద్ధి చెందేలా ప్రణాళికల రూపొందించాలన్నారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై బటర్ ఫ్లై , ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాటి నిర్వహణను మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు.
లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా చూడాలి.…
పట్టణంలో పచ్చదనం పెంపొందించడం కోసం మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వర్షాలు భారీ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేందుకు. నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణం పరిధిలోని చెరువులో కుంటలు గుర్తించి వాటి ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వరద నీరు నిల్వ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయేలా చెరువులు కుంటల్లో ఉన్న వరద కాలువలకు అవసరమైన మనుమతి పనులు చేపట్టి వరద కాలువలు, నాలాల పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తూముల నుండి నీరు పోయేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలోని వివిధ శాఖల అధికారుల తో పాటు, సంగారెడ్డి మాజీ శాసన సభ్యులు జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి పట్టణంలోని ముంపు ప్రాంతాలైన రెవెన్యూ కాలనీ , శ్రీ చక్ర కాలనీ లను మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సందర్శించారు. వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు చేసి తీసుకోవాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించారు. పట్టణానికి అనుకొని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటలలో వరద కాలువలు పూడుకపోవడం , అధిక వర్షాలు పడడం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక, రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీల లోకి వచ్చింది.
సంగారెడ్డి లో 130 ఇండ్లు ముంపుకు గురయ్యాయి.....
రెండు కాలనీలలో సుమారు 130 ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరిందని మంత్రి వివరించారు.భవిష్యత్తులో ఇండ్లలోకి ఇలా వరద నీరు రాకుండా ఉండడం కోసం ఎర్రకుంట, చంద్రయ్య కుంటల వరద కాలువలు పూడిక తీయడంతో పాటు తూములు వెడల్పు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మంత్రి మాట్లాడారు ప్రజలు అధైర్య పడద్దని ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.