తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 12, 2024: Karimnagar : అమానవీయ ఘటన... 3 రోజుల మగ శిశువును కెనాల్ పక్కన పడేశారు..!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 12 Sep 202404:41 PM IST
Telangana News Live: Karimnagar : అమానవీయ ఘటన... 3 రోజుల మగ శిశువును కెనాల్ పక్కన పడేశారు..!
- కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కన పడేశారు. పసికందు అరుపులతో స్థానికులు గమనించి… పోలీసుల సమక్షంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
Thu, 12 Sep 202404:11 PM IST
Telangana News Live: Sangareddy District Court : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు - నిందితుడికి మరణ శిక్ష
- సంగారెడ్డి జిల్లాలోని ఫొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, 12 Sep 202403:27 PM IST
Telangana News Live: TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - టెట్ వివరాల 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..! ఇదిగో డైరెక్ట్ లింక్
- TG DSC TET Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ( https://schooledu.telangana.gov.in/ISMS/ )లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 13తో ఈ గడువు పూర్తి అవుతుంది.
Thu, 12 Sep 202402:21 PM IST
Telangana News Live: BRS Protest : సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత - బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
- సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Thu, 12 Sep 202412:44 PM IST
Telangana News Live: TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
- TG MLC Elections : విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత.. వావిలాల నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు.
Thu, 12 Sep 202412:44 PM IST
Telangana News Live: TGSRTC Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి TGSRTC ప్రకటన - ముఖ్య వివరాలివే
- TGSRTC Recruitment 2024 : తెలంగాణ ఆర్టీసీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం ఇంటర్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
Thu, 12 Sep 202412:11 PM IST
Telangana News Live: Khammam Floods : కోలుకుంటున్న ఖమ్మం - సర్టిఫికెట్లు, విలువైన పత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు
- ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రతి పునరావాస కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు.
Thu, 12 Sep 202411:19 AM IST
Telangana News Live: BRS vs Congress : కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ.. అసలు ఏం జరిగింది? ముఖ్యమైన 10 అంశాలు ఇవే
- BRS vs Congress : తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. అందుకు కారణమయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు వివాదానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.
Thu, 12 Sep 202410:17 AM IST
Telangana News Live: Telangana Tourism : ఈ వీకెండ్ లో 'సాగర్' చూసొద్దామా..! జస్ట్ 800కే వన్ డే టూర్ ప్యాకేజీ - వివరాలివే
- కృష్ణమ్మకు భారీ వరద తరలిరావటంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే మీరు కూడా ఈ వీకెండ్ లో సాగర్ చూడాలనుకుంటే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వివరాలు ఇక్కడ చూడండి…
Thu, 12 Sep 202409:30 AM IST
Telangana News Live: Telangana Teachers : తెలంగాణలో టీచర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం!
- Telangana Teachers : టీచర్లకు సంబంధించి.. ఆన్ డ్యూటీలు, డిప్యుటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 24న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అటు కొందరు ఉపాధ్యాయుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Thu, 12 Sep 202409:26 AM IST
Telangana News Live: Warangal : వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ - మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
- వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Thu, 12 Sep 202408:33 AM IST
Telangana News Live: Singareni Jobs 2024 : సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!
- Singareni Recruitment 2024 Updates: సింగరేణి సంస్థ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా.. 18వ తేదీతో ముగియనున్నాయి. https://scclmines.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి.
Thu, 12 Sep 202408:15 AM IST
Telangana News Live: Telangana Politics : అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి.. హద్దులు దాటిన డైలాగ్‌లు.. కౌశిక్ ఇంటిపై దాడి!
- Telangana Politics : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Thu, 12 Sep 202406:30 AM IST
Telangana News Live: SSC Exams 2025: ఈసారి పదో తరగతి పరీక్షలు ఎలా..? ఆందోళనలో విద్యార్థులు.. ఉపాధ్యాయులు
- TS SSC Board 2025: ఓవైపు పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. మరోవైపు పరీక్షల విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. పరీక్షలు ఏ ఫార్మాట్‌లో ఉంటాయి.. విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
Thu, 12 Sep 202404:48 AM IST
Telangana News Live: Dubbaka Ganesh Mandapam: దుబ్బాక లో సైబర్ క్రైమ్ గణేశా: సజ్జనార్ మనుసు గెలుచుకున్న నిర్వాహకులు
- Cybercrime Ganesha in Dubbaka: వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటుంటారు భక్తులు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు విగ్రహాలను ఏర్పాటు చేసి వారి భక్తి చూపించడంతో పాటు హుందాతనాన్ని చాటుకుంటారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందరి మన్ననలు పొందింది.
Thu, 12 Sep 202404:18 AM IST
Telangana News Live: TG Govt Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
- TG Govt Jobs 2024 : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా 1284 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Thu, 12 Sep 202403:47 AM IST
Telangana News Live: Arikapudi Vs Padi: నువ్వొస్తావా నన్ను రమ్మంటావా, పాడి కౌశిక్ వర్సెస్ అరికపూడి గాంధీ..నేతల ఇళ్లముందు పోలీసుల బందోబస్తు
- Arikapudi Vs Padi: బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి సవాలు నేపథ్యంలో అరికపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు. పాడికౌశిక్ సవాలును స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కౌశిక్ రాకపోతే తానే అతని ఇంటికి వెళ్తానని ప్రకటించారు.
Thu, 12 Sep 202402:55 AM IST
Telangana News Live: Attack On JUDA: మద్యం మత్తులో గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి, అడ్డుకున్న సిబ్బంది..
- Attack On JUDA: ఆస్పత్రుల్లో వైద్యులపై దాడుల్ని అడ్డుకోవాలని ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది నిందితుడిని అడ్డుకున్నారు.
Thu, 12 Sep 202412:21 AM IST
Telangana News Live: Aghori in Kondagattu: అఘోరీ హల్ చల్... కొండగట్టు ను సందర్శించిన నాగసాధు
- Aghori in Kondagattu: ఒళ్ళంతా విభూది... ఒంటిపై వస్త్రాలు లేకుండా మహిళా అఘోరీ హల్ చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకున్నారు. స్మశాన వాటికకు వెళ్ళి దహనం అవుతున్న శవం చుట్టు ప్రదక్షిణ చేశారు. తన ప్రత్యేకతను చాటుకుని వెళ్ళిపోయారు.