TGSRTC Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి TGSRTC ప్రకటన - ముఖ్య వివరాలివే
TGSRTC Recruitment 2024 : తెలంగాణ ఆర్టీసీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం ఇంటర్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు టీజీఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీన తార్నాకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల జీతం చెల్లిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ. 28 వేలు, ట్యూటర్ కు రూ. 25 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పని చేసిన అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు… 7075009463, 8885027780 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
త్వరలోనే భారీ నోటిఫికేషన్:
ఇక టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో ఎక్కువగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఇటీవలే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. ఇందుకు అనుగుణంగా… ఆర్టీసీ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.
త్వరలో భర్తీ చేసే పోస్టులు:
- డ్రైవర్ పోస్టులు-2000
- శ్రామిక్ -743
- డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114
- డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84
- డీఎం/ఏటీఎం/మెకానిక్ ఇంజినీర్-40
- అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23
- మెడికల్ ఆఫీసర్-14
- సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11
- అకౌంట్స్ ఆఫీసర్-6
- మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14.
సంబంధిత కథనం