Singareni Jobs 2024 : సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!-singareni collieries company limited issued recruitment notification for medical specialist vacancies 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Jobs 2024 : సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!

Singareni Jobs 2024 : సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 12, 2024 02:09 PM IST

Singareni Recruitment 2024 Updates: సింగరేణి సంస్థ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా.. 18వ తేదీతో ముగియనున్నాయి. https://scclmines.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి.

సింగరేణిలో ఉద్యోగాలు 2024
సింగరేణిలో ఉద్యోగాలు 2024

పలు రకాల ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 21 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 18వ తేదీతో పూర్తి అవుతుందని ప్రకటించింది.

మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలపరిమితి ఉంటుందని సింగరేణి సంస్థ తెలిపింది. అర్హతలు ఉన్న అభ్యర్థులకు కేవలం ఇంటర్వూ ద్వారానే రిక్రూట్ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 64 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000 చెల్లిస్తారు. సెప్టెంబర్ 21వ తేదీన ఇంటర్వూలు ఉంటాయి. https://scclmines.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - సింగరేణి సంస్థ, తెలంగాణ రాష్ట్రం
  • ఉద్యోగ ఖాళీలు - 21 (మెడికల్ స్పెషలిస్ట్)
  • వయోపరిమితి - 64 ఏళ్ల లోపు ఉండాలి.
  • అర్హతలు - వైద్య విద్యలో డిగ్రీతో పాటు పీజీ పూర్తి చేసి ఉండాలి, పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
  • దరఖాస్తులు ప్రారంభం - 12 సెప్టెంబర్, 2024.
  • దరఖాస్తుల ప్రక్రియకు తుది గడువు - 18 , సెప్టెంబర్, 2024.
  • ఎంపిక విధానం - ఇంటర్వూ
  • ఇంటర్వూలు జరిగే ప్రదేశం -  S.C.C.L. హెడ్ ఆఫీస్,  కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం.
  • అధికారిక వెబ్ సైట్ - . https://scclmines.com/ 
  • అప్లికేషన్ లింక్ - https://scclmines.com/032024/olApplication.aspx