Pancharamam Temples Tour : 2 రోజుల 'పంచారామాల' ట్రిప్ - ఈ అరుదైన ఆలయాలను చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే-telangana tourism operate 3 days pancharamam temples tour from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pancharamam Temples Tour : 2 రోజుల 'పంచారామాల' ట్రిప్ - ఈ అరుదైన ఆలయాలను చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

Pancharamam Temples Tour : 2 రోజుల 'పంచారామాల' ట్రిప్ - ఈ అరుదైన ఆలయాలను చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 20, 2024 01:20 PM IST

Hyderabad - Pancharamam Temples Tour : ఏపీలోని పవిత్రమైన పంచారామాలను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ టూర్ కంప్లీట్ అవుతుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..

పంచారామాల టూర్ ప్యాకేజీ
పంచారామాల టూర్ ప్యాకేజీ (photo source tourism.telangana.gov.in)

Telangana Tourism Pancharamam Temples Tour : సమ్మర్ లో అధ్యాత్మిక ప్రాంతాలను వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). అతి తక్కువ ధరలోనే Pancharamam Temples Tour ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా… ఏపీలోని ప్రముఖ ఐదు పంచారామ క్షేత్రాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

పంచారామాల టూర్ షెడ్యూల్ :

  • పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలను చూసేందుకు పంచారామాల టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • నాన్ ఏసీ హైటెక్ కోచ్ బస్సులో జర్నీ చేస్తారు.
  • పెద్దలకు రూ.4999, పిల్లలకు రూ. 3999గా టికెట్ ధరలు ఉన్నాయి.
  • ఇందులో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షరామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శిస్తారు
  • DAY-1 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • DAY-2 - ఉదయం 5 గంటలకు అమరావతికి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి Palakollu, Bhimavaram, Draksharamam, Samarlakotaకు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • DAY-3 - ఉదయం 07.00 AMకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Telangana Tourism Shirdi Tour 2024: షిర్డీకి(Shirdi) వెళ్లే ప్లాన్ ఉందా…? ఎలాంటి ఇబ్బంది లేకుండా, తొందరగా వెళ్లి రావాలనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism S). హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 2 రోజుల్లోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….

షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వివరాలు:

  • షిర్డీకి వెళ్లేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
  • Shiridi - Flight Package - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది.
  • హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 01. 30 pmకు బయల్దేరుతుంది.
  • 2:50 pmకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30pmకి హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.
  • 7:00PM-7:30PM మధ్య THEME PARK (BABA SOUND &LIGHT SHOW) షో ఉంటుంది.
  • రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు.
  • రాత్రి 9 తర్వాత హోటల్ కు చేరుకుంటారు.
  • DAY2: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పంచముఖి గణపతి టెంపుల్ కు వెళ్తారు. ఓల్డ్ షిర్డీని చూస్తారు. kandoba మందిర్ కు వెళ్లటంతో పాటు SAI TEETH ను సందర్శిస్తారు.
  • మధ్యాహ్నం 12.30pmకు చేరుకుంటారు. సాయంత్రం 5:30PMకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో చేరుకుంటారు.
  • ఈ ప్యాకేజీ ధర రూ. 12499గా ఉంది.
  • ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.
  • ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ కూడా పూర్తి చేయవచ్చు.

Whats_app_banner