KCR On BJP : బీజేపీ ముక్త్ భారత్ కోసం ఏకం కావాలి.. కేంద్రంపై కేసీఆర్ కామెంట్స్
KCR Bihar Tour : కేంద్రంపై కేసీఆర్ మరోసారి కేసీఆర్ కామెంట్స్ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ కలసి రావాలన్నారు. బిహార్ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ను కలిశారు కేసీఆర్.
అంతకుముందు పట్నాలో బిహార్ ముఖ్యమంత్రి నీతిశ్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి రావాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని కేసీఆర్ అన్నారు.
ఇదీ చదవండి : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్
'దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోదీ సర్కార్ ఉంది. బీజేపీ పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదు. మోదీ సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉంది. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైంది. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు.' అని కేసీఆర్ విమర్శించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రొటీన్ ప్రభుత్వాలు వద్దని.. భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని కేసీఆర్ చెప్పారు. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించానని తెలిపారు. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదన్న కేసీఆర్.. చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. విద్వేషం పెరిగితే దేశానికి నష్టమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : వెనకబడిన రాష్ట్రాలకు సాయం చేయకుంటే అబివృద్ధి ఉండదు
ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా? రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటీకరిస్తారా? రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి. రూపాయి ఈ స్థాయిలో ఎప్పుడూ పతనం అవ్వలేదు. సమృద్ధిగా జలాలు ఉన్నా జల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా.. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు అందట్లేదు. దిల్లీలోనూ తాగునీరు, విద్యుత్ సమస్య పరిష్కరం కాలేదు. ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- సీఎం కేసీఆర్
కేంద్ర దర్యాప్తు సంస్థలపై కేసీఆర్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. సీబీఐని బిహార్‌లోకి అనుమతించకపోవడాన్ని కేసీఆర్ సమర్ధించారు. ప్రతీ రాష్ట్రం ఇదే చేయాలని పిలుపును కూడా ఇచ్చారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని కేసీఆర్ అన్నారు. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం