Nitish Kumar wins floor test: విశ్వాస పరీక్షలో నితీశ్ విజయం
బిహార్ అసెంబ్లీలో బుధవారం కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన మహా కూటమి ప్రభుత్వం బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించింది.
Nitish Kumar wins floor test: బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు. బీజేపీ సభ్యుల వాకౌట్ నడుమ ఈ పరీక్షలో ఆయన సునాయాసంగా మెజారిటీ నిరూపించుకున్నారు.
Nitish Kumar wins floor test: విశ్వాస పరీక్ష
బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మెజారిటీని నిరూపించుకున్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన సభ కాసేపటికే మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. రెండు గంటలకు మళ్లీ సమావేశమైన తరువాత సభలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వానికి మద్దతుగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా, బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. 243 సభ్యుల బిహార్ అసెంబ్లీలో మహా కూటమి ప్రభుత్వానికి 165 మంది సభ్యుల మద్దతు ఉంది.
Nitish Kumar wins floor test: స్పీకర్ రాజీనామా
బల పరీక్షకు ముందు స్పీకర్ పదవికి బీజేపీ సభ్యుడు విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. అధికార పక్ష సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో స్పీకర్ పదవికి విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. దాంతో తాత్కాలిక స్పీకర్ గా మహేశ్వర్ హజారీ వ్యవహరించారు. నితీశ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకునేందుకు వీలుగా బుధ, గురు వారాల్లో బిహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.