Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయోద్దు.. వారికి కోర్టు నోటీసులు
దిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవిత కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్‌కు నోటీసులు ఇచ్చింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో కవితపై నిరాధార ఆరోపణలు చేయొద్దని తెలిపింది. విచారణ వచ్చేనెల 13కు వాయిదా వేసింది.
బీజేపీ నేతలు తన పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్లో ఆమె పేర్కొంది. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతులను ఎంచుకున్నారని తెలిపింది. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు అని కోర్టుకు కవిత తెలిపారు. మీడియాలో కథనాలు వచ్చాయని ఆమె న్యాయస్థానానికి వివరించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను ఉన్నట్టుగా ఆరోపణలు చేశారని పలు మీడియా ఛానల్స్‌లో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. ఆగస్టు 21న బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోలను సైతం కోర్టు ముందు ఉంచారు కవిత తరఫు న్యాయవాది. సిటీ కోర్టు ఈ కేసుపై విచారణ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కవిత పేరును కేసులో ఎక్కడా ఎవరూ వాడొద్దని ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజింధర్ సింగ్‌కు నోటీసులు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణను సెప్టెంబర్ 13 కు వాయిదా వేసింది.
సంబంధిత కథనం