Bihar CM Praises KCR : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్-bihar cm nitish kumar praises telangana cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bihar Cm Praises Kcr : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్

Bihar CM Praises KCR : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Aug 31, 2022 05:17 PM IST

KCR Bihar Tour : దేశ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

<p>చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నితీశ్ కుమార్, కేసీఆర్</p>
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నితీశ్ కుమార్, కేసీఆర్

రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు.

'కేసీఆర్ ఇక్కడకి వచ్చేందుకు సమయం కేటాయిచండం చాలా సంతోషకరం. గాల్వన్ లోయ అమరవీరులకు రూ. 10 లక్షలు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ .5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బీహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ అమలుపరిచిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో ప్రజల దీవెనలతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.' అని నితీశ్ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వికాసంలో కేసీఆర్ భాగస్వామ్యం ఎంతో గొప్పదని బిహార్ సీఎం అన్నారు. మిషన్ భగీరథ పథకం గొప్పదని, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యమన్నారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు వదులుకోరు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బిహార్ లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఎప్పటిదాకా వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఉంటుందో అప్పుడే సమాజం వర్ధిల్లుతుందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అందే నిధులకు కోత పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే బీహార్ చాలా గొప్పగా ఉండేది. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచింది. నాకు హైదరాబాద్ తో అవినాభావ సంబంధం ఉంది. అటల్ బీహార్ వాజ్ పేయ్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం బాగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి మరోమారు అభినందనలు.

- బిహార్ సీఎం నితీశ్ కుమార్

Whats_app_banner

సంబంధిత కథనం