August 31 Telugu News Updates : సోనియా గాంధీ కుటంబంలో విషాదం
- August 31 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
Wed, 31 Aug 202205:40 PM IST
కానిస్టేబుల్ సస్పెన్షన్ వ్యవహారంలో ట్విస్ట్
అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబులో సస్పెన్షన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చి పడింది. తనపై అక్రమంగా కేసులు బనాయించారన్న కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్పీపై కేసు నమోదైంది. ఎస్పీతోపాటు ఏఆర్ అడిషినల్ ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌బాషాపై కేసు నమోదైంది.
Wed, 31 Aug 202204:37 PM IST
బాదం పప్పు అనుకుని..
సత్యసాయి జిల్లాలో విషాదం జరిగింది. పండగ సెలవులో పిల్లలంతా ఒకచోటుకి చేరారు. సరదాగా ఆడుకున్నారు. ఏవో కాయలు కనిపించడంతో బాదంపప్పు అనుకుని తిన్నారు. తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Wed, 31 Aug 202203:50 PM IST
జగన్ కడప టూర్
సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ విజయరామరాజు పర్యటన వివరాలను తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Wed, 31 Aug 202203:23 PM IST
మదర్సాను కూల్చేసిన అధికారులు
అసోంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధముందని మరో మదర్సాను అధికారులు కూల్చివేశారు. బొంగాయ్‌గావ్ జిల్లాలో కబైతరి మా అరిఫ్ అనే మదర్సాను నేలమట్టం చేశారు అధికారులు. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేశామని ప్రకటించారు.
Wed, 31 Aug 202202:50 PM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ
ఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నలుగురు మహిళలు మృతి చెందారని అన్నారు. బాధిత కుటుంబాల పరామర్శకు సమయం లేని ముఖ్యమంత్రి.. బిహార్ ఎలా వెళ్లారని ప్రశ్నించారు. రాజకీయాల కోసం బిహార్‌కి వెళ్లే సమయం ఉందా అని అడిగారు. పేదల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమా? అని ప్రశ్నించారు.
Wed, 31 Aug 202204:37 PM IST
బాధితులను పరామర్శించకుండా బీహర్ పర్యటనా?
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మహిళల కుటుంబాలను పరామర్శించకుండా బిహార్‌లో కేసీఆర్ పర్యటిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్ర బాధితులని ఆయన పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు లెక్కన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Wed, 31 Aug 202201:48 PM IST
తెలంగాణలో కేంద్రమంత్రులు పర్యటన
పార్లమెంట్ ప్రవాస్‌యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. గురువారం నుంచి మూడురోజులపాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వచ్చేనెల మూడు, నాలుగో తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.
Wed, 31 Aug 202201:10 PM IST
దంపతుల హత్య కేసు ఛేదించిన పోలీసులు
నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం దంపతుల హత్య కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు తెలిసింది. 28వ తేదీన నెల్లూరులోని అశోక్‌నగర్‌లోని వారి నివాసంలోనే వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మెుదలుపెట్టారు. క్యాంటీన్‌లో అందరి ముందు మందలించారని శివ అనే వ్యక్తి కక్ష పెంచుకుని దంపతులిద్దరిని హత్య చేసినట్లు ఎస్పీ విజయరావు చెప్పారు.
Wed, 31 Aug 202212:28 PM IST
ప్రతీ మండలంలో పీహెచ్ సీలు
ప్రతీ మండలంలో అందుబాటులోకి పీహెచ్‌సీలను తీసుకువచ్చామని హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. టెలి మెడిసిన్ సదుపాయంతో అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. పీహెచ్‌సీలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. పీహెచ్‌సీలో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నట్టు చెప్పారు.
Wed, 31 Aug 202211:56 AM IST
సోనియా గాంధీ ఇంట్లో విషాదం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఈనెల 27న ఇటలీలోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా బుధవారం ఈ విషయం వెల్లడించారు.
Wed, 31 Aug 202211:25 AM IST
ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరం
ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బాధితులకు బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Wed, 31 Aug 202210:57 AM IST
బిహార్ ముఖ్యమంత్రితో కేసీఆర్ చర్చలు
బిహార్ సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు తదితర జాతీయ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల నడుమ చర్చలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లో విలేకరుల సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
Wed, 31 Aug 202210:45 AM IST
ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి
తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వాటిని పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం ప్రమోషన్‌ను చేస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో స్వదేశీ ట్రావెలెర్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వైబ్‌సైట్‌ను ఆవిష్కరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Wed, 31 Aug 202210:21 AM IST
హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి
కుటుంబ నియంత్రణ చికిత్సతో నలుగురి ప్రాణాలు పోయిన ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యుడిని చేస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును వెంటనే బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ అన్నారు. రికార్డు కోసం గంటలో 34 శస్త్రచికిత్సలు చేశారని, ఈ కారణంగా నలుగురు చనిపోయారన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Wed, 31 Aug 202209:44 AM IST
విశాఖలో దారుణం
విశాఖలో దారుణం జరిగింది. పెదజాలారి పేటలో అప్పన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు అప్పన్న ఇంటికి వెళ్లి తలపై కొట్టి కత్తితో ఒంటిపై దాడి చేసి చంపేశారు. పాతకక్షల కారణంగా హత్య జరిగినట్లుగా స్థానికులు అంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 31 Aug 202209:14 AM IST
బీహార్ ముఖ్యమంత్రిని కలిసిన కేసీఆర్
సీఎం కేసీఆర్ పాట్నా చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్. చెక్కుల పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ కు అడుగడుగునా ఫ్లెక్సీలతో అభిమానులు స్వాగతం పలికారు.
Wed, 31 Aug 202210:46 AM IST
ఊయలే ఉరి తాడు అయింది
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫనగర్‌లో దారుణం జరిగింది. 8 నెలల అయిరాను తన తల్లి నైలాన్ తాడుతో చేసిన ఊయలలో పడుకోబెట్టింది. దుస్తులు ఉతకడానికి కింది అంతస్తుకు వెళ్లింది. టవల్‌లో పడుకోబెట్టిన అయిరా నిద్రలోంచి లేచింది. కుదులుతున్న క్రమంలో క్రమంలో తల నైలాన్ తాడు మధ్యలో ఇరుక్కుని ఊపిరాడక అచేతన స్థితిలోకి వెళ్లింది. తల్లి వచ్చి చూసి.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందింది.
Wed, 31 Aug 202208:44 AM IST
పాట్నాకు చేరుకున్న సీఎం కేసీఆర్
ముఖ్యమత్రి కేసీఆర్ పాట్నాకు చేరుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఆయనతో కలిసి గాల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు, మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు, చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
Wed, 31 Aug 202208:43 AM IST
కానిస్టేబుల్ ప్రకాశ్ ను అందుకే డిస్మిస్ చేశాం
తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు 2019లో లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ ప్రకాశ్ డిస్మిస్ చేశామని ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. ఇతర కారణాలేవీ లేవని స్పష్టం చేశారు. 2018లో ఘటన జరిగితే బాధితురాలు 2019 జులైలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. దాని ఆధారంగానే డీఎస్పీతో మూడేళ్లపాటు విచారణ జరిపించామన్నారు.
Wed, 31 Aug 202208:00 AM IST
పీడీ యాక్టు కేసు
తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న మలక్‌పేటకు చెందిన యువకుడిపై హైదరాబాద్ నగర పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈనెల 22, 23న బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు చాదర్ ఘాట్ పోలీసులు పేర్కొన్నారు.
Wed, 31 Aug 202207:29 AM IST
బయల్దేరిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్ కు బయల్దేరారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు.
Wed, 31 Aug 202207:10 AM IST
బాధితులకు పరామర్శ
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Wed, 31 Aug 202206:53 AM IST
సీఎం జగన్ ట్వీట్
'విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Wed, 31 Aug 202206:52 AM IST
పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ
దుబ్బాక లో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన లచ్చపేట 10వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది.
Wed, 31 Aug 202206:48 AM IST
కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Wed, 31 Aug 202205:53 AM IST
గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్ గణేశ్ వద్ద సందడి నెలకొంది. గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ చేశారు. మరోవైపు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Wed, 31 Aug 202205:22 AM IST
తెలంగాణది మొదటి స్థానం
మానవ అక్రమ రవాాణా కేసుల నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం మహారాష్ట్రది. ఈ గణాంకాలను జాతీయ నేరగణాంక సంస్థ తాజాగా విడుదల చేసింది.
Wed, 31 Aug 202205:05 AM IST
బీజేపీ కార్యాలయంలో చవితి వేడుకలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పర్వదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లోబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ తమిళనాడు సహాయ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్,సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు. పూజారుల వేద మంత్రోచ్చారణాలతో ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, 31 Aug 202204:32 AM IST
కొత్తగా 7231 కొవిడ్ కేసులు
దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 45 మంది మృతి చెందారు.
Wed, 31 Aug 202204:07 AM IST
భారీ భద్రత
ఖైరతాబాద్‌లో మహా గణపతి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
Wed, 31 Aug 202203:29 AM IST
మాజీ అధ్యక్షుడు కన్నుమూత
సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ తన 91 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో మంగళవారం చనిపోయారు.
Wed, 31 Aug 202203:02 AM IST
వినాయక చవితి శుభాకాంక్షలు
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోదీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
Wed, 31 Aug 202203:01 AM IST
నమోదుకు చివరి తేదీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకోడానికి బుధవారంతో గడువు ముగియనుంది. జూలైతో ముగిసిన నమోదు గడువును నేటి వరకు పొడిగించారు.
Wed, 31 Aug 202202:13 AM IST
సీఎం జగన్ కడప టూర్
సీఎం జగన్ కడప టూర్ ఖరారైంది. వైఎస్సార్ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Wed, 31 Aug 202201:38 AM IST
ముఖ హాజరు తప్పనిసరి
బోధన, బోధనేతర ఉద్యోగులందరూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ముఖ హాజరు విధానంలోనే హాజరు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఫేసియల్ అంటెడెన్స్ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది.
Wed, 31 Aug 202201:38 AM IST
'కీ' విడుదల
కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష 'కీ'ని అధికారులు విడుదల చేశారు. సుమారు 16వేల కానిస్టేబుల్ పోస్టులకు 6 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు.
Wed, 31 Aug 202201:38 AM IST
సీఎం కేసీఆర్ బిహార్ టూర్
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ తాజాగా బీహార్ లో కూడా వలస కార్మికులకు సాయం చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పాట్నా వెళ్లనున్నారు. సీఎం నితీష్ కుమార్ తో భేటీ కానున్నారు. ఇటీవలే ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ తో సీఎం కేసీఆర్ భేటీ కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అంతే కాదు ఈ పర్యటన సందర్బంగా గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులను అందజేస్తారు. అనంతరం నితీశ్ కుమార్ తో కలిసి కేసీఆర్ లంచ్‌కు వెళ్లనున్నారు. అక్కడ జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు.