‘Bihar CM hurt Hindus’: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై మండిపడ్తున్న హిందువులు!
‘Bihar CM hurt Hindus’ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ మతపరమైన వివాదంలో చిక్కుకున్నారు. వందేళ్ల హిందూ సంప్రదాయాన్ని ఉల్లంఘించారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విషయమేంటంటే.. నితీశ్ కుమార్ ఇటీవల గయ కు వెళ్లారు. అక్కడ విష్ణుపద్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే, తనతో పాటు ముస్లిం అయిన మంత్రి మొహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీని కూడా ఆలయంలోనికి తీసుకువెళ్లారు. గయలోని విష్ణుపద్ ఆలయానికి ఒక సంప్రదాయం ఉంది. హిందూయేతరులెవరూ ఆలయంలోనికి రాకూడదనే ఆ సంప్రదాయం గత వందేళ్లుగా అమల్లో ఉంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తూ.. హిందువుల మనోభావాలను సీఎం నితీశ్ గాయపర్చారని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.