KA Paul On Konda Surekha : కొండా సురేఖ రాజీనామా చేయకపోతే కేసు వేస్తా : కేఏ పాల్
KA Paul On Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు రాంగోపాల్ వర్మ కూడా కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అక్కనేని కుటుంబానికి దన్నుగా నిలుస్తున్నారు.
కొండా సురేఖకు మతిభ్రమించిందని కేఏ పాల్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలనన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే కేసు వేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. కొండా సురేఖ కామెంట్స్‌పై ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
'కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని.. ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే.. తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో వుండే అందరి కోసం.. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున, నాగచైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని.. మరచిపోలేని గుణపాఠం నేర్పాలి' ఆర్జీవీ ట్వీట్ చేశారు.
'4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు.. తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని.. సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని.. ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
'కేటీఆర్‌ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారనీ.. అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి?' అని ఆర్జీవీ ప్రశ్నించారు.
'ఆవేదనతోనే విమర్శలు చేశా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి' అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.