Bigg Boss 18: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..-bigg boss 18 telugu heroines sameera reddy anitha isha koppikar to be part of salman khan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 18: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..

Bigg Boss 18: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..

Hari Prasad S HT Telugu
Sep 18, 2024 12:05 PM IST

Bigg Boss 18: బిగ్ బాస్ 18 హిందీ హౌజ్ లోకి ఇద్దరు తెలుగు హీరోయిన్లు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగులో హిట్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరితోపాటు ఆర్జీవీ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన మరో నటి కూడా హౌజ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..
బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..

Bigg Boss 18: బిగ్ బాస్ 18 సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఓవైపు తెలుగు, మరాఠీ, కన్నడలాంటి భాషల్లో ఇప్పటికే కొత్త సీజన్లు ప్రారంభం కాగా.. ఇప్పుడు హిందీలోనూ రాబోతోంది. ఈ సీజన్ కు మరోసారి బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తిరిగి రానుండగా.. ఒకప్పుడు తెలుగులో నటించిన హీరోయినట్లు హౌజ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 18లోకి ఆ ఇద్దరు..

బిగ్ బాస్ ఇండియాకు పరిచయం అయింది హిందీ ద్వారానే అన్న విషయం తెలుసు కదా. 2006లో తొలిసారి జరిగిన ఈ రియాల్టీ షో.. ఇప్పుడు 18వ సీజన్ జరుపుకోబోతోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి దూరంగా ఉన్న హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ కొత్త సీజన్ తో తన ఫేవరెట్ టీవీ షోకి తిరిగి రానున్నాడు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈసారి ఇద్దరు తెలుగు సినిమాల హీరోయిన్లు కూడా కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారు.

వాళ్లలో ఒకరు సమీరా రెడ్డి కాగా.. మరొకరు అనిత. ఈ ఇద్దరూ ఒకప్పుడు మంచి హిట్ తెలుగు సినిమాల్లో నటించారు. ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేనుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనిత.. ఆ తర్వాత పెద్దగా హిట్స్ అందుకోలేదు. ఇక అటు సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అశోక్, నరసింహుడు లాంటి మూవీస్ లో నటించింది.

ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నట్లు సమాచారం. వీళ్లే కాదు బాలీవుడ్ తోపాటు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ డైరెక్ట్ చేసిన పలు బోల్డ్ సినిమాల్లో నటించిన ఇషా కొప్పికర్ కూడా ఈసారి హౌజ్ లోకి రానుంది. దీంతో ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే ఎంతో ఆసక్తి రేపుతోంది.

బిగ్ బాస్ 18 గురించి..

బిగ్ బాస్ 18 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్ టీజర్ కూడా సోమవారం (సెప్టెంబర్ 16) రాత్రి రిలీజ్ చేశారు. టైమ్ కా తాండవ్ అంటూ ఈ కొత్త సీజన్ కు మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తిరిగి వస్తున్నాడు. ఈ కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుందన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇక ఈ షోలో గతంలో ఖత్రోంకీ ఖిలాడీ రియాల్టీ షోలో ఫైనల్ చేరిన నియా శర్మ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెనే ఈసారి కన్ఫమ్ అయిన తొలి కంటెస్టెంట్ అని భావిస్తున్నారు. 2006లో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ హిందీ షోలో రాహుల్ రాయ్ తొలి విజేతగా నిలిచాడు. గతేడాది జరిగిన చివరి సీజన్లో ఎంసీ స్టాన్ ట్రోఫీ గెలుచుకున్నాడు.