Niharika Konidela: అఖిల్ అక్కినేనితో నిహారిక కొణిదెల షార్ట్‌ఫిల్మ్ - రిలీజ్ కాకుండా అడ్డుకున్న రాజమౌళి
కమిటీ కుర్రాళ్లు మూవీతో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల్లో ఈ మూవీ 7.48 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(1 / 5)
కమిటీ కుర్రాళ్లు మూవీతో పదకొండు మంది హీరోలకు టాలీవుడ్‌కు పరిచయం చేసింది నిహారిక. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నది.
(2 / 5)
కమిటీ కుర్రాళ్లు ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నిహారిక. తన యాక్టింగ్ జర్నీ ఆరంభంపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
(3 / 5)
తన కెరీర్ ఓ షార్ట్ ఫిల్మ్‌తో ప్రారంభమైందని చెప్పింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో అఖిల్ అక్కినేని, తాను లీడ్ రోల్స్‌లో నటించినట్లు నిహారిక తెలిపింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకత్వం వహించినట్లు నిహారిక చెప్పింది.
(4 / 5)
మేము చేసిన షార్ట్‌ఫిల్మ్ చూసిన రాజమౌళి రిలీజ్ చేయకపోతేనే బెటర్ అంటూ సలహా ఇచ్చారని నిహారిక అన్నది. అలా తమ తొలి ప్రయత్నం ఫెయిలైందని వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు