Nagarjuna: కార్తి చిత్రంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటూ..
- Nagarjuna on Satyam Sundaram: సత్యం సుందరం చిత్రంపై కింగ్ నాగార్జున స్పందించారు. తమిళ స్టార్లు కార్తి, అరవింద స్వామి నటించిన ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
- Nagarjuna on Satyam Sundaram: సత్యం సుందరం చిత్రంపై కింగ్ నాగార్జున స్పందించారు. తమిళ స్టార్లు కార్తి, అరవింద స్వామి నటించిన ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
(1 / 5)
టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి (2016) చిత్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' సినిమా చూసిన నాగార్జున.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
(2 / 5)
సత్యం సుందరం సినిమా తన ముఖంపై చిరునవ్వు తెప్పించిందని నాగార్జున నేడు (సెప్టెంబర్ 30) ట్వీట్ చేశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందని అన్నారు.
(3 / 5)
సత్యం సుందరం మూవీ చూశాక చిరునవ్వుతోనే నిద్రపోయానని నాగార్జున రాసుకొచ్చారు. “డియర్ బ్రదర్ కార్తి.. నేను నీ సినిమా సత్యం సుందరం గత రాత్రి చూశా. నువ్వు, అరవింద స్వామి అద్భుతంగా చేశారు. మిమ్మల్ని చూస్తున్నంత సేపు నా ముఖంపై చిరునవ్వు ఉంది. అదే నవ్వుతో నిద్రలోకి వెళ్లా” అని నాగార్జున ట్వీట్ చేశారు.
(4 / 5)
తన చిన్ననాటి జ్ఞాపకాలను సత్యం సుందరం మూవీ గుర్తు చేసిందని నాగార్జున తెలిపారు. “నా చిన్ననాటి చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మన ఊపిరి చిత్రం కూడా గుర్తొచ్చింది. హృదయాలను హత్తుకునే చిత్రాలను ప్రజలు, విమర్శకులు ప్రశంసిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. టీమ్ మొత్తానికి అభినందనలు” అని నాగార్జున ట్వీట్ చేశారు.
ఇతర గ్యాలరీలు