IPL Points Table 2023 : ఐపీఎల్ పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులేంటి?
IPL Points Table 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తర్వాత పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఏంటి?
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు 168 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత ఏయే జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇక్కడ చూడండి.
1. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడి 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
2. చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌లు ఓడి 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
3. ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
4. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 11 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు గెలిచింది. 1 మ్యాచ్‌లో ఫలితం లేకుండా 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది.
5. రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
6. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
8. పుంబా కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 10 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది.
9. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.
10. 11 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది.
ఫాఫ్ డు ప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌ను నిలుపుకొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తన స్థానాన్ని పటిష్టం చేస్తూనే ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 576 స్కోర్ చేశాడు. పర్పుల్ క్యాప్‌లో మహ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం షమీ వికెట్ల సంఖ్య 19. ప్రస్తుత ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 43 ఓవర్లు బౌలింగ్ చేసి 311 పరుగులు ఇచ్చి 19 వికెట్లు పడగొట్టాడు. షమీ అత్యుత్తమ ప్రదర్శన 11/4గా ఉంది.