Delhi Capitals to release Shardul: స్టార్ పేస్‌బౌలర్ శార్దూల్ ఠాకూర్ సహా ఐదుగురు ప్లేయర్స్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2023 వేలం వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో నవంబర్ 15 వరకూ ఆయా టీమ్స్‌ను ప్లేయర్స్‌ను రిలీజ్ లేదా ఇతర ఫ్రాంఛైజీలతో ట్రేడ్ చేసుకునే వీలుంది.
అన్ని టీమ్స్ గడువు లోపు తాము రిటేన్, రిలీజ్ చేయదలచుకున్న ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రకటించనున్నాయి. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ గత వేలంలో కొనుగోలు చేసింది. అతనికి ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లించడం విశేషం. 2022 సీజన్‌లో ఢిల్లీ తరఫున 14 మ్యాచ్‌లలో శార్దూల్ 15 వికెట్లు తీసుకున్నాడు.
అయితే పదికి పైగా ఎకానమీ రేటుతో నిరాశపరిచాడు. అటు బ్యాట్‌తోనూ రాణించింది లేదు. దీంతో అతన్ని ఈసారి వదిలేయాలని క్యాపిటల్స్ టీమ్ నిర్ణయించింది. అతనితోపాటు ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్, న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్, పంజాబ్ బ్యాటర్ మణ్‌దీప్ సింగ్, ఆంధ్రా ఓపెనర్ అశ్విన్ హెబ్బర్‌లను కూడా ఢిల్లీ రిలీజ్ చేయనున్నట్లు పీటీఐ వెల్లడించింది.
నిజానికి శార్దూల్‌ను మరో ఫ్రాంఛైజీతో ట్రేడ్ చేయాలనుకున్నా.. అతని ధర చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. ఐదుగురు ప్లేయర్స్‌ను రిలీజ్ చేయనుండటంతో వచ్చే మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కాస్త ఎక్కువ డబ్బే ఉండనుంది. ఇక తమ కెప్టెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉండటంతో భరత్‌ను వద్దనుకుంటోంది. గత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 2022లో మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
టాపిక్