Women's Day 2024 : మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం, ఈ పరీక్షలు తప్పనిసరి-womens day 2024 women must take these health test for better health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Day 2024 : మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం, ఈ పరీక్షలు తప్పనిసరి

Women's Day 2024 : మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం, ఈ పరీక్షలు తప్పనిసరి

Anand Sai HT Telugu
Mar 03, 2024 07:40 PM IST

Women's day 2024 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి తెలుసుకుందాం..

మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవం (Unsplash)

మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు.. పురాణాల నుంచి స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఒక్క స్త్రీ లేకపోతే.. అది కుటుంబంలా ఉండదు. అమ్మ మన కోసం ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఎంతో కష్టపడుతుంది. డబ్బులు వచ్చే పని చేసేదానికి విలువ ఉంటుందని.. అదే పని అని చాలా మంది పురుషులు అనుకుంటారు.. కానీ ఇంట్లో వాళ్ల అవసరాలను తీరుస్తూ జీతం లేని జీవితం గడిపే మీ అమ్మ కోసం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని హెల్త్ చెకప్స్‌ చేయించండి.

బిజీ వర్క్ తదితర కారణాల వల్ల మహిళలు తరచుగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించండి. వివిధ వయసుల స్త్రీలకు వివిధ పోషకాలు అవసరం. మ‌హిళ‌ల ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన కొన్ని పోషకాల గురించి తెలుసుకుందాం.. మీరు మీ కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతుంటారు.. కానీ మీ కోసం ఎవరు ఆలోచించరు. మీరే మీకోసం ఆలోచించుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే. .మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి..

ఐరన్ తీసుకోవాలి

మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. రక్తహీనత అనేది శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోయే పరిస్థితి. 30 ఏళ్లు దాటిన చాలా మంది మహిళల్లో రక్తహీనత వస్తుంది. శరీరానికి సరిపడా ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి ఇది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడే ప్రోటీన్. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం. మీ ఆహారంలో మాంసం, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలికూర, బ్రోకలీ, బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.

విటమిన్ ఎ తప్పనిసరి

ఈ జాబితాలో విటమిన్ ఎ రెండో స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. మీ ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి.

విటమిన్ బి12 ఉంది

జాబితాలో తదుపరిది విటమిన్ B12 ఉంది. ఇది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కాల్షియం కూడా కావాలి

ఈ జాబితాలో కాల్షియం నాల్గో స్థానంలో ఉంది. మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, తరచుగా ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

విటమిన్ డి తీసుకోండి

ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది.

మెగ్నీషియం ముఖ్యం

మెగ్నీషియం కూడా స్త్రీలకుకావాలిసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ పరీక్షలు చేయించండి

భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్‌ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్‌ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్‌ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అతి ముఖ్యమైన CBP, థైరాయిడ్‌, విటిమిన్స్‌ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్‌, ఐరన్‌ వంటి పరీక్షలను మీ అమ్మలకు, అక్కచెల్లెల్లకు, భార్యకు మీ వంతు బాధ్యతగా చేయించండి.. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోడం మీ బాధ్యత.