Chanakya Niti On Woman : పురుషుల్లో ఈ లక్షణాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కుటుంబ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషుల్లో మహిళలు ఎలాంటి విషయాలను ఇష్టపడుతారో వివరించాడు.
నిజానికి ప్రతీ అమ్మాయికి పెళ్లి గురించి వందల కలలు ఉంటాయి. తను పెళ్లి చేసుకునే అబ్బాయికి కొన్ని లక్షణాలు ఉండాలని స్త్రీ కోరుకోవడం సహజం. ఆచార్య చాణక్యుడు కూడా మగవారికి ఈ లక్షణాలు ఉంటే మంచిదని, మహిళలు అలాంటి అబ్బాయిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారని చాణక్య నీతిలో చెప్పాడు. స్త్రీలు తాను పెళ్లి చేసుకునే అబ్బాయిలో కొన్ని విషయాలు కచ్చితంగా ఉండాలని కోరుకుంటారు.
ధైర్యంగా ఉండాలి
చాణక్యుడు ప్రకారం, పురుషులు ధైర్యంగా ఉండాలి. ఉదాహరణ మన ఇంట్లో శునకం ఉంటుంది. ఏ క్షణంలోనైనా కుక్క కుటుంబ సభ్యులను విడిచిపెట్టదు. ఎవరైనా వస్తే.. ధైర్యంతో పోరాడుతుంది. అందుకే తిండి పెట్టిన ఇంటి కోసం ఎంతో విశ్వాసంగా ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతుంది. అదేవిధంగా పురుషులు కూడా తమ భార్యాపిల్లలను కాపాడుకోవాలని చాణక్యుడు చెప్పాడు.
వదిలి వెళ్లకూడదు
చాణక్యుడి ప్రకారం విధేయత అనేది మనిషికి చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంటిని వదిలి వెళ్లకూడదు. మనిషికి విధేయత చాలా ముఖ్యం. భార్యతో చివరి వరకు కలిసి జీవించాలి. అలా కాకుండా ఇతర స్త్రీలను కోరుకోవడం సరికాదన్నాడు చాణక్యుడు. అలా కోరుకునే పురుషుడిని మహిళలు ఇష్టపడరు.
ఇంటిని గమనించాలి
చాణక్య నీతి ప్రకారం, పురుషులు ఎక్కడికి వెళ్లినా వారి ఇంటిని, పిల్లలను గమనించాలి. వారు ఇంట్లో సరిగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. పగలు రాత్రి కుటుంబం గురించి ఆలోచించే పురుషుడిని మహిళలు ఇష్టపడుతారు. నిద్రపోతున్నప్పుడు చిన్నపాటి శబ్దం వచ్చినా వెంటనే లేవాలి. కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా కాపు కాయాలి. పురుషులు తమ భార్య, పిల్లలపై ఎక్కడికి వెళ్లినా ఓ కన్నేసి ఉంచాలి. వారి జాగ్రత్తలు చూసుకోవాలి.
బాధ్యత తప్పనిసరి
మనిషికి బాధ్యత చాలా ముఖ్యం అంటాడు చాణక్యుడు. ఎంత కష్టపడినా రేపటి కోసం పొదుపు చేయాలి. అతిగా ఖర్చు చేయవద్దు. తన కుటుంబం కోసం డబ్బులు సేవ్ చేయాలి. పొదుపు అనేది ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగపడుతుందని చాణక్యుడు వివరించాడు.
భార్యపై శ్రద్ధ ఉండాలి
ఆచార్య చాణక్య నీతి ప్రకారం, భర్త తన భార్య పట్ల ప్రేమ, శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంటి కోసం పని చేసే ఆమెను ప్రత్యేకంగా చూసుకోవాలి. సంతోష పెట్టాలి. కచ్చితంగా ఆమెను గౌరవంగా చూడాలి. ఆమెను కొట్టకూడదు, తిట్టకూడదు. ఆమె మానసిక స్థితిని బట్టి ఆమెతో ప్రవర్తించాలి. అలా చేస్తే మీ భాగస్వామి కచ్చితంగా మీపై ప్రేమను పెంచుకుంటుంది.
ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించాడు. చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలను పాటించేవారు ఉన్నారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో భార్యాభర్తల బంధం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను కచ్చితంగా పాటించాలి. అప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. చాణక్య నీతి ప్రతీ వ్యక్తికి ఉపయోగపడుతుంది.