Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఆ తేదీ వరకు రాత్రిళ్లు కూడా ఘాట్ రోడ్డులో వెళ్లొచ్చు-mahashivaratri brahmotsavam 2024 at srisailam temple start from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఆ తేదీ వరకు రాత్రిళ్లు కూడా ఘాట్ రోడ్డులో వెళ్లొచ్చు

Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఆ తేదీ వరకు రాత్రిళ్లు కూడా ఘాట్ రోడ్డులో వెళ్లొచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 01, 2024 06:55 PM IST

Srisailam Maha Shivratri Brahmotsavam 2024 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు (DD News Andhra)

Srisailam Maha Shivratri Brahmotsavam 2024: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఇవాళ రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శనివారం నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు నల్లమల అడవుల గుండా భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు:

1వ రోజు ధ్వజారోహణం జరుగుతుంది. శ్రీ కాళహస్తీశ్వరా స్వామి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ

2వ రోజు భృంగి వాహనసేవ

3వ రోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం. ఇంద్రకీలాద్రి, విజయవాడ వారిచే శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ

4వ రోజు మయూర వాహనసేవ

శ్రీ వరసిద్ధి వినాయక స్వామివార్ల దేవస్థానం. కాణిపాకం వారిచే పట్టువస్త్రాల సమర్పణ, అదేరోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే కుడా పట్టువస్త్రాల సమర్పణ

5వ రోజు రావణ వాహనసేవ.

రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టువస్త్రాల సమర్పణ.

6వ రోజు పుష్ప పల్లకిసేవ

7వ రోజు గజ వాహనసేవ

8వ రోజు మహాశివరాత్రి " పండుగ పర్వదినం నాడు ప్రభోత్సవం, నంది వాహనసేవ, స్వామివారికి లింగోద్భవకాలంలో మహా రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం

9వ రోజు రధోత్సవం, తెప్పోత్సవం

10వ రోజు ధ్వజావరోహన

11వ రోజు అశ్వ వాహనసేవ, పుష్పోత్సవం, శయణోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం..

శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చింది అటవీ శాఖ. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి ప్రకటన విడుదల చేశారు. పెద్ద దోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.

Whats_app_banner