Garlic Under Pillow : నిద్రపోయేప్పుడు దిండు కింద వెల్లుల్లి ఉంచితే కలిగే లాభాలు
Garlic Under Pillow : పురాతన కాలం నుండి నిద్రలేమికి నివారణగా వెల్లుల్లిని వాడుతారు. నిద్రపోయేటప్పుడు దిండు కింద వెల్లుల్లిని ఉంచుతారు. దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.
వెల్లుల్లి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పదార్థం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.
వెల్లుల్లిని పురాతన కాలంలో నిద్రలేమికి నివారణగా ఉపయోగించారు. ఇప్పటికీ కొంతమంది అదే పద్ధతి పాటిస్తారు. దిండు కింద వెల్లుల్లిని ఉంచుతారు. దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
వెల్లుల్లి శక్తివంతమైన సువాసన నాసికా భాగాలను అన్‌లాగ్ చేయడానికి, శ్వాసను నియంత్రించడానికి సహాయపడుతుంది. మీకు జలుబు ఉంటే మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. తద్వారా వెల్లుల్లిలోని అల్లిసిన్ శరీరంపై దాడి చేసే సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు కొన్ని వెల్లుల్లిని తినడానికి ప్రయత్నించండి.
వెల్లుల్లిలో మెగ్నీషియం, పొటాషియం అనే రెండు ఖనిజాలు ఉంటాయి. నాణ్యమైన నిద్రకు ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. మెగ్నీషియం ఆరోగ్యకరమైన స్థాయిలను నిర్వహించడం ద్వారా శరీరానికి మంచి, లోతైన, ప్రశాంతమైన నిద్రను సాధించడంలో సహాయపడుతుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. పొటాషియం నిద్ర సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ ఈ రెండు పోషకాలను తగినంతగా పొందినట్లయితే, మంచం కింద వెల్లుల్లి రెబ్బలను ఉంచాల్సిన అవసరం లేదు.
వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది తరచుగా వచ్చే సూక్ష్మక్రిములను నివారిస్తుంది. మీ ఆహారంలో వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల మీరు త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే వెల్లుల్లిలోని అల్లిసిన్ శరీరంలోని సూక్ష్మజీవులను నివారిస్తుంది. ప్రతిరోజూ రాత్రి మీ దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రించడం వల్ల క్రిములు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. మీకు జలుబు ఉంటే, మీరు మీ ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోవచ్చు.
మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు చిన్న కీటకాలు, దోమలతో ఇబ్బంది పడితే మీ దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచండి. వెల్లుల్లి కీటకాలకు విషపూరితంగా పని చేస్తుంది. మీ దిండు కింద ఉంచితే కీటకాలు మీ దగ్గరకు రావు. కొందరు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి నీళ్లలో వేసి ఆ నీటిని కీటకాలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో పిచికారీ చేస్తుంటారు. ఎందుకంటే వెల్లుల్లి వాసనను కీటకాలు ఇష్టపడవు.
నిద్రలేమికి మరో సింపుల్ గార్లిక్ రెమెడీ ఏంటంటే.. వెల్లుల్లి పాలు తయారు చేసి తాగాలి. ఈ పాలను సిద్ధం చేయడానికి, 1 కప్పు పాలను బాగా మరిగించి, దానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి 3 నిమిషాలు బాగా మరిగించి కొంచెం తేనె వేసి తాగాలి.
మీ దిండు కింద వెల్లుల్లితో నిద్రించడం వలన కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వెల్లుల్లి తినడం మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. వెల్లుల్లి వాసన మనస్సును రిలాక్స్ చేస్తుంది.
టాపిక్