Sleep Without Pillow : దిండు లేకుండా నిద్రపోండి.. ఎన్నో ప్రయోజనాలు-why you must sleep without a pillow heres reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Without Pillow : దిండు లేకుండా నిద్రపోండి.. ఎన్నో ప్రయోజనాలు

Sleep Without Pillow : దిండు లేకుండా నిద్రపోండి.. ఎన్నో ప్రయోజనాలు

Anand Sai HT Telugu

Sleep Without Pillow Benefits : చాలా మందికి దిండు లేకపోతే నిద్రపట్టదు. కచ్చితంగా దిండు ఉండాల్సిందే. కానీ దీని వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

దిండు లేకుండా నిద్రపోతే కలిగే లాభాలు (Unsplash)

మనిషికి కచ్చితంగా నిద్ర ఉండాల్సిందే. నిద్రలేకుంటే చాలా సమస్యలు వస్తాయి. అయితే నిద్రపోయే సమయంలో చేసే కొన్ని తప్పులు మీకు ఇబ్బందులు తీసుకొస్తాయి. చిన్న చిన్న పొరపాట్లే కానీ భారీమూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు నిద్రించేందుకు వివిద పద్ధతులను పాటిస్తారు. కొందరు దిండు పెట్టుకుని నిద్రపోతే.. మరికొందరు దిండు లేకుండా పడుకుంటారు. కొందరికి దిండు లేకుంటే మాత్రం రాత్రంతా జాగరమే అవుతుంది. కానీ ఇలా దిండు పెట్టుకుని నిద్రపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

దిండుపై పడుకోవడం ఆరోగ్యకరమేనా?

మెత్తని దిండ్లపై పడుకోవడం అంటే అందరికీ ఇష్టమే. ఇది ప్రశాంతమైన నిద్రను అందించవచ్చు. కానీ ఆరోగ్యకరమైన నిద్రను అందిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే దిండు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దిండు లేకుండా పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.

మెుటిమలు వస్తాయి

దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మొటిమలు రాకుండా నిరోధించవచ్చు. దిండుతో నిద్రిస్తున్నప్పుడు, మీ ముఖం దిండుకు అంటుకుని ఉంటుంది. ఇది మీ ముఖంపై బ్యాక్టీరియా, మురికిని వ్యాపింపజేస్తుంది. మీ చర్మంపై మొటిమలను కలిగిస్తుంది. మొటిమలే కాకుండా ముఖంపై ముడతలు కూడా కలిగిస్తుంది. ముఖాన్ని దిండుకు నొక్కి నిద్రపోతే.. అది అకాల ముడతలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలి.

వెన్ను నొప్పికి కారణమవుతుంది

మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు చేయవలసిన మొదటి పని దిండుతో నిద్రపోకుండా ఉండటం. ఎందుకంటే మీ వెన్ను నొప్పికి ప్రధాన కారణం మీ దిండు. మీరు దిండు లేకుండా నిద్రపోతున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. తల కింద దింటు ఉంటే వెన్నెముక మీద ప్రభావం పడుతుంది.

నిద్ర నాణత్యపై ప్రభావం

దిండు లేకుండా నిద్రపోవడం మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెత్తని దిండుపై పడుకోవడమే ప్రశాంతంగా నిద్రించడానికి, మీ మెడ, వీపుకు విశ్రాంతినిచ్చే ఏకైక మార్గం అని మీరు అనుకుంటే అది తప్పు. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిరోధించవచ్చు.

తప్పుడు భంగిమలో నిద్రపోవడం కూడా మీ ఒత్తిడిని పెంచుతుంది. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు అని ఆలోచిస్తూ నిద్ర పోవడం ప్రారంభిస్తారు. ఇది మీ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.

మనం మెలకువగా ఉన్నప్పుడు మెదడు ఎప్పుడూ పని చేస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు మెదడు విశ్రాంతిగా ఉంటుంది. ఇది మన మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. దిండు పెట్టుకుంటే కొన్నిసార్లు నిద్రపట్టదు. మనం బాగా నిద్రపోతేనే మన మెదడు బాగా పనిచేస్తుందని మర్చిపోకండి.

పిల్లలకు దిండు అలవాటు చేయెుద్దు

మీ పిల్లలు ఎక్కువకాలం పాటు మృదువైన దిండుపై నిద్రపోతే, వారు ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్‌తో బాధపడొచ్చు. ఈ లోపం సంభవించినట్లయితే పిల్లల తల ఒక వైపు వంగినట్టుగా కనిపిస్తుంది. శిశువు తల చాలా మృదువుగా ఉంటుంది ఈ లోపం త్వరగా వస్తుంది. మీ బిడ్డకు ఎప్పుడూ దిండు పెట్టకండి.

పిల్లలు ఎక్కువ సేపు దిండుతో నిద్రిస్తే మెడ బెణుకు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దిండు అయితే ఈ సమస్య ఉండదు, సాధారణ దిండు అయితే పిల్లలకు ఇబ్బందే. చాలా మందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. దిండ్లు మార్చకుండా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. మీ గదిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రదేశాలలో దిండు కూడా ఒకటి. దానిని మీ తల కింద పెట్టుకుని శ్వాస తీసుకున్నప్పుడు అవి మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది మీకు అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. అందుకే దిండు వాడకపోవడమే ఉత్తమమైన పని.